వాహనదారులకు బిగ్ అలర్ట్..! ఇక అక్కడ నగదు చెల్లింపులు నిలిపివేత.. ఏప్రిల్ 1 నుంచి..
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజాల్లో నగదు చెల్లింపులు పూర్తిగా రద్దు చేసి, డిజిటల్ పేమెంట్స్‌ను తప్పనిసరి చేసింది. ఫాస్ట్‌ట్యాగ్, యూపీఐ వంటి పద్ధతులలో మాత్రమే రుసుములు చెల్లించాలి. రద్దీ తగ్గించడం, ప్రయాణ సమయం ఆదా చేయడం, వసూళ్లలో పారదర్శకత పెంచడమే దీని లక్ష్యం.

కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజాల్లో నగదు చెల్లింపులను నిలిపివేస్తూ, పూర్తిగా డిజిటల్ పేమెంట్స్‌కే మారాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నూతన విధానాన్ని వచ్చే ఏప్రిల్ 1 నుంచి కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర రవాణా శాఖ స్పష్టం చేసింది.
టోల్‌ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం, రుసుముల వసూళ్లలో పారదర్శకత పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఫాస్టాగ్ వ్యవస్థ అమల్లో ఉన్నప్పటికీ, కొన్ని వాహనాలు నగదు చెల్లించి వెళ్లే పరిస్థితి కొనసాగుతోంది. తాజా నిర్ణయంతో ఇకపై నగదు లావాదేవీలకు పూర్తిగా ముగింపు పడనుంది.
ఏప్రిల్ నుంచి టోల్‌ప్లాజాలు ఫాస్టాగ్ లేదా యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపుల ద్వారానే పనిచేయనున్నాయి. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో వాహనదారులు ముందుగానే ఫాస్టాగ్ యాక్టివేట్ చేసుకోవాలని, డిజిటల్ పేమెంట్స్‌కు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే వాహనాలు టోల్‌ప్లాజాల వద్ద ఆగే సమయం తగ్గి ప్రయాణాలు వేగవంతమవుతాయని, ఇంధనం ఆదా అవుతుందని, చిల్లర సమస్యలు ఉండవని, రశీదుల కోసం వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
