AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips for Home: అందం కోసం ఈ మొక్కలు లేదా చెట్లను ప్రధాన ద్వారం దగ్గర పెట్టుకుంటున్నారా..! కష్టాలకు వెల్కమ్ చెప్పినట్లే

జ్యోతిషశాస్త్రంలో మాత్రమే కాదు వాస్తు శాస్త్రంలో కూడా ఇంటి నిర్మాణం, ఆవరణలో పెంచుకునే మొక్కలు సహా ప్రతి విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం చెట్లకు విశేష ప్రాముఖ్యత ఉంది. అయితే కొన్ని రకాల మొక్కలను, చెట్లను ఇంటి ప్రధాన ద్వారం సమీపంలో పెంచకూడదు. ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వలన ఆ ఇంట్లో ప్రతికూలత ఏర్పడుతుంది. ఈ రోజు ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెంచడం నిషేధించ బడిన మొక్కలు ఏమిటో తెలుసా..

Vastu Tips for Home: అందం కోసం ఈ మొక్కలు లేదా చెట్లను ప్రధాన ద్వారం దగ్గర పెట్టుకుంటున్నారా..! కష్టాలకు వెల్కమ్ చెప్పినట్లే
Vastu Tips For Plants
Surya Kala
|

Updated on: Jul 23, 2025 | 2:55 PM

Share

పచ్చదనం, పరిశుభ్రమైన వాతావరణం కోసం చుట్టూ చెట్లు, మొక్కలు ఉండటం మంచిదని భావిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ప్రధాన ద్వారం దగ్గర కొన్ని చెట్లు , మొక్కలు ఉండటం వల్ల అశుభం, ప్రతికూలత ఏర్పడవచ్చు. పండ్లు, పూలు, ఆకులతో నిండిన నీడనిచ్చే చెట్లు ఇంటి అందాన్ని పెంచుతాయి. దీనితో పాటు చెట్లు, మొక్కలు ఇంటి పరిసరాల వాతావరణాన్ని శుభ్రంగా ఉంచడమే కాకుండా చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా శుభ్రంగా ఉంచుతాయి. పచ్చదనాన్ని కాపాడుతాయి. అయితే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెట్లు, మొక్కలను నాటే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంటి ప్రధాన ద్వారం లేదా తలుపు తర్వాత కొన్ని చెట్లు, మొక్కలను ఉంచడం శుభప్రదం కాదని జ్యోతిష్క శాస్త్రం తో పాటు వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాంటి చెట్లు, మొక్కలు పెంచడం వలన అశాంతి, ఆర్థిక సమస్యలు, ప్రతికూలతను పెంచుతాయి. కనుక ఈ రోజు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఏ చెట్లు, మొక్కలను పెంచకూడదో తెలుసుకుందాం..

మనీ ప్లాంట్: దీనిని సంపద మొక్క అంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ శుక్ర గ్రహానికి సంబంధించినది. ఈ మొక్క సంపదను ఆకర్షిస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో సరైన దిశలో లేదా ప్రదేశంలో నాటితే, అది చాలా ప్రయోజనాలను తెస్తుంది. అయితే మనీ ప్లాంట్‌ను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా ఇంటి వెలుపల పెంచకూడదు. ఇలా చేయడం వలన డబ్బుకి ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రావి చెట్టు: వాస్తు శాస్త్రం ప్రకారం రావి చెట్టు ఇంటి తలుపు దగ్గర ఉండకూడదు. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నాటిన రావి చెట్టు పనిలో అడ్డంకులను సృష్టించగలదు. రావి చెట్టును హిందూ మతంలో మతపరమైన , పవిత్రమైన చెట్టుగా పరిగణిస్తారు. అయితే ఈ రావి చెట్టుని ఇంటి లోపల లేదా ప్రధాన ద్వారం దగ్గర పెంచకూడదు

ముళ్ళ మొక్కలు: కొన్ని రకాల మొక్కలను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచవద్దు. ముఖ్యంగా ముళ్ళు లేదా పాల మొక్కలను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కూడా నాటకూడదు. ఇది పొరుగువారితో లేదా బంధువులతో సంబంధాన్ని దెబ్బతీస్తుంది.

దీనితో పాటు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చింత చెట్టు, రేగు వంటి మొదలైన చెట్లు ఉండకూడదు. ఇంటి దగ్గర చింతపండు చెట్టు ఉండటం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం, ఇంటి ముందు మందారం మొక్క ఉండటం కూడా అశుభకరమని భావిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

SBI రుణ రేట్లు తగ్గింపు.. గృహ, వ్యక్తిగత లోన్స్‌ చౌకగా.. EMIలో..
SBI రుణ రేట్లు తగ్గింపు.. గృహ, వ్యక్తిగత లోన్స్‌ చౌకగా.. EMIలో..
ఆడవాళ్లకు భరోసాగా బెంగళూరు ఆటో డ్రైవర్స్.. ఆ ఒక్క మెసేజ్‌తో..
ఆడవాళ్లకు భరోసాగా బెంగళూరు ఆటో డ్రైవర్స్.. ఆ ఒక్క మెసేజ్‌తో..
సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. స్పెషల్ ట్రైన్స్‌ ఇవే
సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. స్పెషల్ ట్రైన్స్‌ ఇవే
కాలేయ సమస్యలకు సంజీవని చేప నూనె.. బెనిఫిట్స్ తెలిస్తే వదలిపెట్టరు
కాలేయ సమస్యలకు సంజీవని చేప నూనె.. బెనిఫిట్స్ తెలిస్తే వదలిపెట్టరు
చూశారా ఈ చిత్రం.! ఇకపై ఫోన్ చేస్తున్నవారి పేరు మీ స్క్రీన్‌పైనే..
చూశారా ఈ చిత్రం.! ఇకపై ఫోన్ చేస్తున్నవారి పేరు మీ స్క్రీన్‌పైనే..
ఈ వ్యక్తులకు క్యారెట్ విషంతో సమానం.. తింటే బాడీ షెడ్డుకే..
ఈ వ్యక్తులకు క్యారెట్ విషంతో సమానం.. తింటే బాడీ షెడ్డుకే..
స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్.. పాఠశాలలకు సెలవులు!
స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్.. పాఠశాలలకు సెలవులు!
అధిక కొలెస్ట్రాల్ ప్రారంభ సంకేతాలు ఎలా ఉంటాయి.?నిర్లక్ష్యం చేస్తే
అధిక కొలెస్ట్రాల్ ప్రారంభ సంకేతాలు ఎలా ఉంటాయి.?నిర్లక్ష్యం చేస్తే
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు
భారత శాస్త్రవేత్తల అద్భుత సృష్టి..
భారత శాస్త్రవేత్తల అద్భుత సృష్టి..