AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంటి దగ్గర వేప చెట్టు ఏ దిక్కున ఉంటే మంచిది.. దివ్య వృక్షం చేసే మేలు ఏంటో తెలుసా..?

పురాతన కాలంలో, ఇంటి చుట్టూ వేప చెట్టును నాటడం వల్ల చల్లదనం మాత్రమే కాకుండా శాంతి, శుభం కూడా లభిస్తుందని విశ్వసించేవారు.. ఈ పవిత్ర వృక్షం వాస్తుశిల్పం, జ్యోతిష్యం, ఆరోగ్యం దృక్కోణం నుండి చాలా ముఖ్యమైనది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే ఏమవుతుందో తెలుసుకుందాం..

Vastu Tips: ఇంటి దగ్గర వేప చెట్టు ఏ దిక్కున ఉంటే మంచిది.. దివ్య వృక్షం చేసే మేలు ఏంటో తెలుసా..?
Neem Tree
Shaik Madar Saheb
|

Updated on: Dec 19, 2025 | 3:12 PM

Share

పురాతన కాలం నాటి నుంచి వేపచెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.. దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వేప చెట్టు గాలికి ఎన్నో రోగాలను కలిగించే క్రిములు చచ్చిపోతాయంటారు.. అందుకే.. దీనిని దివ్య వృక్షం అని చెప్తుంటారు. వేపచెట్టు బెరడు, కాయలు, ఆకులు అన్ని అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా పని చేస్తాయి.. పురాతన రోజుల్లో, వేసవి వేడిని తగ్గించడానికి ప్రజలు తమ ఇళ్ల చుట్టూ వేప చెట్లను నాటడం సర్వసాధారణం.. గ్రామాల్లో ఇది ఎక్కువగా ఉన్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో అరుదుగా కనిపిస్తాయి.. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల పక్కన ఇప్పటికీ వేప చెట్లు కనిపిస్తాయి.. అయితే, వేప చెట్టు చల్లదనాన్ని అందించడం మాత్రమే కాదు.. ఇది వాస్తుశాస్త్రం, ఆధ్యాత్మిక దృక్కోణం నుంచి కూడా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది.

వేప చెట్టు అనేక ఔషధ గుణాలు కలిగిన పవిత్ర వృక్షం. ఇది అనేక వ్యాధులను సహజంగా నయం చేస్తుందని, వాస్తు దోషాలను కూడా తొలగిస్తుందని నమ్ముతారు. అందుకే చాలా మొక్కల మాదిరిగానే వేప చెట్టుకు హిందూ మతంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చెట్టును దేవత ఆశీర్వాదాలకు చిహ్నంగా భావిస్తారు. అందుకే.. పూజలు కూడా చేస్తారు.

ఇంటి బయట వేప చెట్టును నాటడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి. ఇంటికి శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. జ్యోతిష్యం ప్రకారం, వేప శని, రాహు, కేతువుల చెడు ప్రభావాలను నివారిస్తుంది. అందువల్ల, ఈ చెట్టు ఇంట్లో ఉండటం వల్ల జీవితంలో స్థిరత్వం, ఆరోగ్యం, శాంతి పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

వాస్తు ప్రకారం, ఇంటికి దక్షిణ దిశలో వేప చెట్టును నాటడం చాలా శుభప్రదం. ఈ చెట్టు కుజ గ్రహ ప్రభావంతో ముడిపడి ఉంది. దీనికి నీటిని సమర్పించడం వల్ల హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి.. కుజ గ్రహం, చెడు ప్రభావాలు తగ్గుతాయి. నీటిలో వేప ఆకులను కడగడం లేదా ఇంటిని శుభ్రపరిచే సమయంలో వాటిని ఉపయోగించడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

వేప చెట్టుతో చేసిన మాల లేదా దండను ధరించడం వల్ల శని అశుభ ప్రభావాలను నివారించి మంచి ఫలితాలు లభిస్తాయి. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, కుటుంబంలో శాంతి, ఆనందాన్ని తీసుకురావడానికి ఈ చెట్టును పూజించే సంప్రదాయం కూడా ఉంది. ముఖ్యంగా మకరం, కుంభ రాశి వారు వేప చెట్టును పూజించడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతారని జ్యోతిష్యం చెబుతోంది.

అందువల్ల, వేప చెట్టు కేవలం పర్యావరణ అనుకూల చెట్టు మాత్రమే కాదు – ఇది ఆరోగ్యం, శాంతి, సంపదకు చిహ్నం. మీ ఇంటి దగ్గర వేప చెట్టు ఉండటం అన్ని శుభాలే కలుగుతాయని.. మీ ఇంటికి నిజమైన ఆశీర్వాదంగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు జ్యోతిష్య పండితులు.. అయితే.. ఇది విశ్వాసాల ఆధారంగా కొలుస్తుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..