AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thyroid Problem: ఈ నాలుగు కూరగాయలు ఆరోగ్యానికి మంచివే.. థైరాయిడ్ రోగులకు విషంతో సమానం..

మానవ శరీరంలో మెడ భాగంలో ఉండే ఒక చిన్న సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి మన శరీర జీవక్రియను నియంత్రిస్తుంది. జీవక్రియ, పెరుగుదల, అభివృద్ధి వంటి అనేక శరీర విధులను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయనప్పుడు అనేక సమస్యలు వస్తాయి. థైరాయిడ్ రోగులకు మందులతో పాటు సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ రోజు థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఏ కూరగాయలను తినకూడదో ఈ రోజు తెలుసుకుందాం

Thyroid Problem: ఈ నాలుగు కూరగాయలు ఆరోగ్యానికి మంచివే.. థైరాయిడ్ రోగులకు విషంతో సమానం..
Health Tips For Thyroid Pat
Surya Kala
|

Updated on: Jul 23, 2025 | 1:23 PM

Share

మన మెడలోని థైరాయిడ్ గ్రంథి ఒక చిన్న గ్రంథి. అయితే చాలా ముఖ్యమైన అవయవం. ఇది మన శరీర జీవక్రియ (ఆహారాన్ని శక్తిగా మార్చడం), శక్తి స్థాయిలు, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ సరిగ్గా పనిచేయనప్పుడు చాలా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అయ్యే హైపోథైరాయిడిజం సమస్య ఉన్నవారు మందులతో పాటు, సరైన ఆహారం కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా ఆరోగ్యకరమైనవిగా భావించే కొన్ని కూరగాయలు థైరాయిడ్ సమస్యని పెంచుతాయి. థైరాయిడ్ రోగులు ఏ కూరగాయలను తినకూడదు లేదా జాగ్రత్తగా తినాలి అనే విషయం ఈ రోజు తెలుసుకుందాం..

క్యాబేజీ కుటుంబానికి చెందిన కూరగాయలు థైరాయిడ్ రోగులు కొన్ని కూరగాయలు తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటిని గోయిట్రోజెనిక్ అంటారు. ఇవి థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను గ్రహించే సామర్థ్యాన్ని అడ్డుకునే సమ్మేళనాలు. థైరాయిడ్ హార్మోన్లను తయారు చేయడానికి అయోడిన్ చాలా ముఖ్యమైనది. ఈ వర్గంలో ప్రధానంగా క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు వంటి క్రూసిఫెరస్ కూరగాయలు ఉన్నాయి. ఈ కూరగాయలలో గ్లూకోసినోలేట్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలోని థైరాయిడ్ పనితీరుకు అంతరాయం కలిగిస్తాయి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు పొరపాటున కూడా క్యాబేజీ కుటుంబానికి చెందిన కూరగాయలు తినకూడని సూచిస్తారు.

పచ్చిగా, అధికంగా తినొద్దు క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. థైరాయిడ్ రోగులు వాటిని పచ్చిగా తినకూడదు. పచ్చిగా ఉన్నప్పుడు వాటిలో అధిక గైట్రోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. కనుక వాటిని తినాలంటే (ఉడకబెట్టడం లేదా ఆవిరిపట్టడం) ఉడకబెట్టి తినడం వలన ఈ సమ్మేళనాల ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. కనుక ఎవరైనా థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలను పచ్చిగా తినొద్దు. , వాటిని ఎల్లప్పుడూ బాగా ఉడికించి, పరిమిత పరిమాణంలో తినండి. వీటి రసం రూపంలో లేదా అధికంగా తినడం లేదా పచ్చిగా తినవద్దు. ఎందుకంటే ఇది ఆరోగ్య సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

నిపుణుల సలహా ఏమిటంటే ఈ కూరగాయలతో పాటు సోయా ఉత్పత్తులు కూడా గైట్రోజెనిక్ కావచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. కనుక థైరాయిడ్ రోగులు వీటిని మితంగా తీసుకోవాలి. అదనంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, గ్లూటెన్ వినియోగం కూడా కొంతమంది థైరాయిడ్ రోగులకు ముఖ్యంగా హషిమోటోస్ థైరాయిడిటిస్ ఉన్నవారికి సమస్యాత్మకంగా ఉంటుంది.

అయితే తినే ఆహారం మాత్రమే థైరాయిడ్‌ను నయం చేయదని.. మందులతో పాటు ఆరోగ్య అలవాట్లు కూడా సమస్య నివారణకు సహాయపడుతుంది. ఎవరైనా థైరాయిడ్ రోగి అయితే వైద్యుడిని లేదా అర్హత కలిగిన డైటీషియన్‌ను సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!