AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Koti Talambralu: రాములోరి కల్యాణానికి రెడీ అవుతున్న భక్తులు.. కోటి తలంబ్రాల మహా యజ్ఞానికి వానర సేన శ్రీకారం..

సీతారాముల కల్యనోత్సవాన్ని దేశం మొత్తం జరుపుకుంటుంది. కానీ భద్రాచలంలో రాములోరి కళ్యాణం మాత్రం వెరీ వెరీ స్పెషల్. భద్రాద్రిలో జరిగే సీతారాముల కళ్యాణంలో తలంబ్రాలు అతి ముఖ్య ఘట్టం. ఈ తలంబ్రాలను సమర్పించడం తెలుగు రాష్ట్రాలలోని రామయ్య భక్తులు అత్యంత పవిత్ర కార్యక్రమంగా భావిస్తారు. తలంబ్రాల కోసం ధాన్యం పండించే సమయం నుంచి ఆ ధాన్యాన్ని చేతులతో వలిచి.. తలంబ్రాలు తయారు చేసి సీతారాములకు సమర్పించే వరకూ ఎంతో నియమనిష్టలను పాటిస్తారు. తాజాగా వరి పొలాల్లో కోటి తలంబ్రాలు పంట కోసం దాన్యం జల్లిన శ్రీరామచంద్రుడు హనుమంతుడు జాంబవంతుడు..ఎక్కడంటే

Koti Talambralu: రాములోరి కల్యాణానికి రెడీ అవుతున్న భక్తులు.. కోటి తలంబ్రాల మహా యజ్ఞానికి వానర సేన శ్రీకారం..
Vanara Sena
Surya Kala
|

Updated on: Jul 23, 2025 | 11:17 AM

Share

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్చుతాపురంలో కోటి తలంబ్రాల మహా యజ్ఞానికి వానరసేన శ్రీకారం చుట్టారు. దివి నుంచి భూమికి వానరసేన దిగివచ్చినట్లుగా జాంబవంతుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, శ్రీరాముడు, అంగధుడు వేషధారణతో దుక్కి దున్ని నాగలి పట్టి వరి విత్తనాలను నాటారు. ప్రతి ఏటా జూలై నెలలో వర్షాలు మొదలుకొని సమయంలో రాములోరి కళ్యాణానికి కోటి తలంబ్రాలు పంట కోసం గోకవరం మండలం అచ్చుతాపురంలోని ఉన్నా ఎకరం 60 సెంట్లలలో వానర వేషధారణలో వరి నాట్లు వేయడం ఆనవాయితీ.

కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్యం సంఘం సభ్యులు కళ్యాణ అప్పారావు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఏవిధమైన రసాయాణాలు పిచికారీ చేయకుండా వానర వేషధారణ తోనే వరి విత్తనాలు జల్లీ, ఊడ్పు ఊడ్చి, పంట కోత కోసి, ధాన్యాన్ని తలంబ్రాలుగా మలిచే వరకు వానర వేషధారణ తోనే గత 15 ఏళ్లుగా కోటి తలంబ్రాల కార్యక్రమం చేస్తున్నారు. చివరి దశలో వరి ధాన్యాన్ని సేకరించి గోటితో ఒలిచి కోటి తలంబ్రాలుగా మలిచి అయోధ్య, ఒంటిమిట్ట, భద్రాచలం శ్రీరాముని కళ్యాణానికి పంపిస్తారు.. ఇలా కోటి తలంబ్రాల పంటకు వానర సేన నుంచి రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న మహిళలు ఈ ధాన్యాన్ని గోటి కోటితో శ్రీరామ తత్వంలో వలిచి కోటి తలంబ్రాలకు శ్రీకారాన్ని చుడతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..