AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Hanuman: రామాయణంతో ముడిపడి ఉన్న గ్రామం.. అక్కడ హనుమంతుడిని పూజించరు..పేరుని కూడా పలకరు..

రామ భక్త హనుమాన్ ను హిందువులు ఎంతో భక్తిశ్రద్దలతో పూజిస్తారు. సంకటాలు తొలగించి కోరిన కోర్కెలు తీర్చే సంకట మోచనుడికి దేశ వ్యాప్తంగా అనేక ఆలయాలున్నాయి. భారీ సంఖ్యలో భక్తులున్నారు. అయితే మన దేశంలో ఒక ప్రాంతంలో హనుమంతుడికి ఆలయాలు లేవు సరికదా.. కనీసం హనుమంతుడి పేరుని కూడా స్మరించరు. హనుమంతుడి తలవడం కూడా ఈ గ్రామంలో నిషేధం.. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే..

Lord Hanuman: రామాయణంతో ముడిపడి ఉన్న గ్రామం.. అక్కడ హనుమంతుడిని పూజించరు..పేరుని కూడా పలకరు..
Hanuman Named Ban Village
Surya Kala
|

Updated on: Jul 18, 2025 | 10:44 AM

Share

భారతదేశంలో రాముడిని పూజించే ఒక ప్రదేశం ఉంది.. అయితే అక్కడ హనుమంతుడిని పూజించడం నిషేధం. ఇక్కడ హనుమంతుడి ఆలయం లేదు. అంతేకాదు కనీసం హనుమంతుడి పేరుని కూడా తలచుకోరు. ఒక్క హనుమంతుడి భక్తుడు కూడా కనిపించరు. అంతేకాదు ఆ గ్రామంలోని ప్రజలు హనుమాన్, బజరంగ్, సంకటమోచన్ , మారుతి వంటి పేర్లను కూడా ఉపయోగించరు. ఇలా హనుమంతుడికి పూజలు చేయని గ్రామం ఎక్కడ ఉంది? ఎందుకు ఇలా చేస్తున్నారు ? అసలు కారణం ఏమిటి అనేది తెలుసుకుందాం..

ఈ గ్రామంలో నమ్మకం వెనుక ఉన్న కథ రామాయణ కాలం నాటిది. ఉత్తరాఖండ్‌లోని చమోలిలో ద్రోణగిరి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో హనుమంతుడి పేరుని తలవడంపై నిషేధం ఉంది. ఇక్కడ హనుమంతుడి విగ్రహం లేదా ఆలయం లేదు. అయితే ఈ గ్రామంలోని వారు రాముడిని పూజిస్తారు. ఇక్కడి నివాసితులు రామాయణ కాలం నుంచి నేటి వరకు ఆంజనేయ స్వామిపై కోపంగా ఉన్నారు. ఇక్కడి ప్రజలు హనుమంతుడిని పూజించరు. అయితే రాముడి శత్రువు అయిన నింబ రాక్షసుడిని పూజిస్తారు.

రామాయణ కాలంతో ముడిపడి ఉన్న నమ్మకం

ఇవి కూడా చదవండి

స్థానికుల నమ్మకాల ప్రకారం.. ఈ గ్రామానికి సంబధించిన కథ రామాయణ కాలంతో ముడిపడి ఉంది. రావణుడి చేస్తున్న సమయంలో ఆ యుద్ధంలో లక్ష్మణుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అప్పుడు లక్ష్మణుడికి సృహ తెప్పించేందుకు హనుమంతుడు సంజీవని మూలికను తీసుకురావడానికి ఈ గ్రామానికి వచ్చాడని చెబుతారు. మూలిక కోసం వెతుకుతున్నప్పుడు.. హనుమంతుడు ఏ మూలిక సంజీవని అనేది గుర్తించలేకపోయాడు. దేనిని తీసుకోవాలో అర్థం చేసుకోలేకపోయాడు. దీంతో లక్ష్మణుడి ప్రాణాలను కాపాడటానికి మొత్తం పర్వతాన్ని ఎత్తి.. రామ లక్ష్మణులున్న చోటికి తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే సంజీవని మాత్రమే లక్ష్మణుడి ప్రాణాలను కాపాడగలదు.

పర్వత దేవతకి హనుమంతుడిపై ఆగ్రహం

పర్వత దేవత హనుమంతుడి పర్వతాన్ని తీసుకుని వెళ్లడాన్ని క్షమించలేదు. హనుమంతుడు పర్వతాన్ని పెకిలించే ముందు ఆ దేవత అనుమతి తీసుకోలేదని.. ఆ సమయంలో పర్వత దేవత ధ్యానంలో నిమగ్నమై ఉన్నదని స్థానికులు నమ్ముతారు. హనుమంతుడు పర్వత దేవత కుడి చేతిని పెకిలించి తీసుకెళ్లాడు. కారణంగానే నేటికీ ఇక్కడి ప్రజలు హనుమంతుడిని క్షమించలేకపోతున్నారు. అందుకే ఇక్కడి ప్రజలు హనుమంతుడిని పూజించరు.. కనీసం పేరుని కూడా తలచుకోరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.