Indoor Plants: ఇంట్లో ఈ మొక్కలను పెంచుకోండి.. అందంతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాయి. అవి ఏమిటంటే..
ఇంట్లో మొక్కలను పెంచుకోవడం వలన ఇంటికి అందం పెరగడమే కాదు ఒత్తిడి కూడా తగ్గుతుంది. అయితే ఇంట్లో పెంచుకునే మొక్క విషయంలో కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ గా ఎటువంటి మొక్కలను పెంచుకోవాలనే విషయంపై పూర్తి అవగాహన ఉండాలి. ఆ మొక్కలు వలన స్వచ్చమైన గాలిని ఇచ్చి.. సానుకూలంగా అనిపిస్తూ మానసిక స్థితిని తాజాగా మారేలా చేయాలి. అటువంటి మొక్కల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

మొక్కలు వేరు వేరు రకమైన సానుకూల ప్రభావాలను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఇంట్లో రకరకల మొక్కలు నాటడం ఫ్యాషన్‌గా మారిపోయింది. అయితే కొన్ని రకాల ఇండోర్ మొక్కలు ఇంట్లోని గాలిని శుభ్రపరచడమే కాదు ఒత్తిడిని కూడా తగ్గిస్తాయని ప్రజలు నమ్ముతారు. వీటిని ఇంటి అలంకరణలో ఉపయోగించవచ్చు.. అంతేకాదు ఇవి ఇంటిలోని గాలికి మంచి తాజాదనాన్ని తెస్తాయి. కఅయితే ఈ మొక్కలు ఇంట్లోని వారికి సంతోషకరమైన వాతావరణాన్ని ఇవ్వడంతో పాటు దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయా అనేది ప్రశ్న. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ కూడా దీనిని ధృవీకరించింది. ఈ సంస్థ తన అధ్యయనంలో అనేక ఇండోర్ మొక్కలు మన జీవితంలో ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని కనుగొంది. ఈ మొక్కలు మనకు శారీరకంగా, మానసికంగా సహా అనేక ఇతర విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయని పేర్కొంది.
కనుక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపే మొక్కలను మన ఇంట్లో నాటడం చాలా ముఖ్యం. అయితే ఏ మొక్కలు నాటడం మంచిదో అనే విషయంలో గందరగోళం ఉంటుంది. ఈ రోజు ఇంట్లో పెంచుకునే కొన్ని మొక్కల గురంచి తెలుసుకుందాం.. ఈ మొక్కలు అందంగా కనిపించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.
పీస్ లిల్లీ పీస్ లిల్లీ ఇంట్లో కొత్త రకమైన తాజాదనాన్ని తెస్తుంది. దీని కారణంగా మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఈ మొక్కకు తక్కువ వెలుతురు అవసరం. ఇంట్లో ఈ మొక్కని పెంచుకుంటే మనం సంతోషంగా ఉంటాము. లోపల అశాంతి కూడా తగ్గుతుంది. అయితే ఈ మొక్క పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా పెట్టుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పీస్ లిల్లీ ఆకులు పిల్లలకు, పెంపుడు జంతువులకు హాని కలిగిస్తాయని నమ్ముతారు.
జాడే మొక్క ఈ మొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనికి తక్కువ వెలుతురు, తక్కువ సంరక్షణ అవసరం. ఇది చాలా ఒత్తిడితో కూడిన వాతావరణంలో కూడా మనం దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. దీని కారణంగా.. మన పని సామర్థ్యం పెరుగుతుంది. అందుకే ఈ మొక్క చాలా ఆఫీసుల్లో పెట్టుకోవడం కనిపిస్తుంది.
ఏనుగు చెవి మొక్క ఈ మొక్క ఆకులు పెద్దవిగా , హృదయాకారంలో ఉంటాయి. అందుకే దీనిని ‘ఏనుగు చెవి’ అని కూడా పిలుస్తారు. నివేదికల ప్రకారం ఈ మొక్కను ఇంట్లో నాటడం ద్వారా అధిక రక్తపోటు, ఆందోళన వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని విశ్వాసం. ఈ విషయం నిజమని అనేక పరిశోధన నివేదికలలో వెల్లడించింది.
స్పైడర్ ప్లాంట్ ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం సులభం ఎందుకంటే దీనికి తక్కువ నీరు అవసరం. ఈ మొక్క గాలి నుంచి కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైన అంశాలను తొలగించడంలో సహాయపడుతుందని నాసా నివేదిక కనుగొంది. ఇది కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా ఇండోర్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. అందుకే దీనిని ఎయిర్ ప్యూరిఫైయర్ అని కూడా పిలుస్తారు. అంతేకాదు ఈ మొక్క ఒత్తిడిని తగ్గించడానికి కూడా పనిచేస్తుంది.
స్నేక్ ప్లాంట్ ఈ మొక్క ఆకులు పొడవుగా ఉండి కత్తిలా కనిపిస్తాయి. ఈ స్నేక్ మొక్కలు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని అంటారు. ప్రత్యేకత ఏమిటంటే దీనిని బెడ్‌రూమ్‌లో కూడా పెంచుకోవచ్చు. దీని అతిపెద్ద లక్షణం ఏమిటంటే ఈ మొక్క అందంగా ఉంటుంది. కనుక ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా అందం, ఆరోగ్యం ఇస్తుంది ఈ స్నేక్ ప్లాంట్.
మనీ ప్లాంట్ ఈ మొక్క దాదాపు అందరి ఇళ్లలోనూ కనిపిస్తుంది. దీని ఆకులు హృదయాకారంలో ఉంటాయి. ఈ మొక్క మనలోని భయాన్ని,అశాంతిని తొలగిస్తుంది. ఈ మొక్క దృష్టిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. వాస్తవానికి ఈ మొక్క ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది. ఒత్తిడిని తగ్గించడంతో పాటు.. ఇది కళ్ళను చల్లబరుస్తుందని కూడా చెబుతారు.
తులసి, పుదీన ఇంట్లో తులసి, మల్లె లేదా పుదీనా వంటి మొక్కలను పెంచుకోవడం వల్ల వాతావరణంలో సానుకూల సువాసన ఉంటుంది. దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మల్లె రక్తపోటును తగ్గిస్తుందని మరియు హృదయ స్పందన రేటును కూడా నిర్వహిస్తుందని నిరూపించబడింది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








