AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: భర్తలు ఎందుకు ఇతర స్త్రీలను ఇష్టపడతారు? పెళ్లిని నిలుపుకోవాలంటే దంపతులు ఏమి చేయాలంటే..

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు చెప్పాడు. తల్లిదండ్రులు పిల్లలు మధ్య ఉన్న సంబంధం భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ నమ్మకం సహా అనేక విషయాలను నీతి శాస్త్రంలో వివరించారు. అప్పటి కాలంలో చెప్పినా ఇవి నేటికీ అనుసరణీయమే. అలా చాణక్యుడు చెప్పిన విషయాల్లో ఒకటి అందమైన భార్య, ముచ్చటైన పిల్లలు ఉన్నా భర్త ఎందుకు వివాహేతర సంబంధం గురించి ఆలోచిస్తాడు? ముఖ్యంగా వివాహిత పురుషులు ఇతరుల భార్యలను ఇష్టపడటానికి గల కారణాలను కూడా వివరించాడు.

Chanakya Niti: భర్తలు ఎందుకు ఇతర స్త్రీలను ఇష్టపడతారు? పెళ్లిని నిలుపుకోవాలంటే దంపతులు ఏమి చేయాలంటే..
Chanakya Niti
Surya Kala
|

Updated on: Jul 16, 2025 | 12:34 PM

Share

పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెత చాలా మందికి వర్తిస్తుంది. ముఖ్యంగా చాలా మంది భర్తలు తన భార్య కంటే.. తన దగ్గర ఉన్న డబ్బుకంటే.. ఇతరుల భార్యలను అందంగా భావిస్తారు. తన దగ్గర ఉన్న డబ్బుకంటే ఇతరుల డబ్బులను ప్రేమిస్తారు. ఈ గుణం ఆ కాలంలో ఉన్న పురుషులలోనే కాదు నేటి మగాడిలో కూడా ఉంది. అందుకంటే తన భార్య మంచిది అనుకూలమైనది అందగత్తె అయినా సరే వేరే స్త్రీని ఇష్టపడతారు. వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి ఆసక్తిని ఎక్కువగా చూపిస్తారు. ఇలాంటి కేసులకు సంబందించిన వార్తలు ప్రస్తుతం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని కారణంగా భార్యాభర్తల సంబంధం విచ్ఛిన్నమవుతోంది. కుటుంబాలు విడిపోతున్నాయి. అయితే చాణక్య నీతిలో వివాహిత పురుషులు ఇతరుల భార్యలను ఇష్టపడటానికి గల కారణాలను కూడా వివరించాడు. ఈ రోజు భర్త తన భార్యకి దూరమై వేరొకరి వైపు ఆకర్షితుడయ్యేందుకు గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

భార్యకు భర్త దూరంగా ఉండటానికి కారణాలు

వివాహిత పురుషులు తమ భార్యలను విడిచిపెట్టి ఇతర స్త్రీల పట్ల ఆకర్షితులవడానికి లేదా వివాహేతర సంబంధాలు కలిగి ఉండటానికి గల కారణాలను కూడా చాణక్య నీతిలో ప్రస్తావించారు. దీని ప్రకారం చిన్న వయస్సులోనే వివాహం, భార్య ఎంపిక లేదా బలవంతంగా జరిపించే వివాహం, శారీరక దూరం, మారుతున్న ప్రాధాన్యతలు, స్వీయ నియంత్రణ లేకపోవడంతో పాటు తప్పుడు సహవాసం వంటి కారణాల వల్ల.. వివాహిత పురుషులు తమ భార్యలను విడిచిపెట్టి ఇతర స్త్రీల పట్ల ఆకర్షితులవుతారు. ఈ కారణంగా సుఖ సంతోషాలతో సాగుతున్న కుటుంబాలు విడిపోతాయి. భార్యాభర్తల మధ్య సంబంధం విచ్ఛిన్నమవుతుంది. అయితే.. ఇలా వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. భార్య నుంచి విడిపోయిన తర్వాత చాలా సార్లు ఎవరు లేకుండా .. ఒంటరిగా మిగిలిపోతాడు. అప్పుడు తాను చేసిన తప్పులకు చాలా పశ్చాత్తాపపడతాడు.

ఇవి కూడా చదవండి

బంధాన్ని ఎలా కాపాడుకోవాలంటే

భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడానికి , అది విచ్ఛిన్నం కాకుండా నిరోధించడానికి చాణక్య నీతిలో అనేక మార్గాలను ప్రస్తావించింది. భార్యాభర్తల బంధం నిలబడాలంటే.. దంపతులు తరచుగా మాట్లాడుకుంటూ ఉండాలి. ఏదైనా సమస్య ఏర్పడితే.. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఆ సమస్యని పరిష్కరించుకోవాలి. భార్యాభర్తల మధ్య ప్రేమను కొనసాగించడానికి.. చిన్న చిన్న విషయాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం. అలాగే భార్యాభర్తలు ఒకరితో ఒకరు గడిపేందుకు సమయాన్ని కేటాయించాలి. ఇద్దరూ సంతోషంగా సమయం గడపాలని చెప్పాడు చాణక్య

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.