AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: రోడ్లు శుభ్రం చేసే సమయంలో కార్లో కూర్చోవడమే ఆ యువతి పని.. లక్షల్లో సంపాదన

పరిస్థితులకు అనుగుణంగా కొంచెం తెలివిగా అలోచిస్తే సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. డబ్బులు కూడా సంపాదించవచ్చని నిరూపించింది ఒక మహిళ. అమెరికాలో రోడ్డుని శుభ్రం చేసే సమయంలో కార్లను తప్పనిసరిగా జరపాలి. దీనినే స్ట్రీట్ స్వీపింగ్ టైమ్ అని అంటారు. ఈ సమయంలో ప్రజలు పడే ఇబ్బందులను గుర్తించింది.. సరికొత్తగా ఆలోచించి కార్ సిట్టింగ్ బిజినెస్ ను మొదలు పెట్టింది. ఇప్పుడు కారులో కూర్చుని లక్షలు సంపాదిస్తోంది.

Viral News: రోడ్లు శుభ్రం చేసే సమయంలో కార్లో కూర్చోవడమే ఆ యువతి పని.. లక్షల్లో సంపాదన
Sydney Charlet
Surya Kala
|

Updated on: Jul 16, 2025 | 10:59 AM

Share

అగ్రరాజ్యం అమెరికాలోని ప్రధాన నగరం న్యూయార్క్ సిటీ. దీనిని ప్రపంచ రాజధాని కూడా అంటారు. ఈ నగరంలో వాహనాలను పార్కింగ్ చేయడం అంటే నరకంతో సమానం అని .. ముఖ్యంగా రోడ్లను శుభ్రం చేసే సమయంలో కార్లను తీయడం కష్టంగా భావిస్తారు. ఇష్టం ఉన్నా లేకుండా తప్పనిసరిగా స్ట్రీట్ స్వీపింగ్ టైమ్ లో కార్లను జరపల్సిందే.. లేదంటే భారీగా జరిమానాలను కట్టాల్సి ఉంటుంది. నగర ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యని గుర్తించిన ఓ యువతి తన మెదడుకి పదును పెట్టింది.. కార్ సిట్టింగ్ బిజినెస్ ను మొదలు పెట్టింది. ఈ బిజినెస్ ఏమిటి? ఆ యువతికి ఈ అలోచన ఎలా వచ్చింది తెలుసుకుందాం..

సిడ్నీ ఛార్లెట్ అనే యువతి కొన్ని రోజుల క్రితం ఉద్యోగం పోగొట్టుకుంది. దీంతో మళ్ళీ ఉద్యోగం వేట మొదలు పెట్టింది. ఎందుకంటే డబ్బులు లేకపోతే ఖరీదైన నగరంలో జీవించడం కష్టం కనుక. దీంతో తనకు ఇష్టం లేకపోయినా తన కారును న్యూయార్క్ సిటీకి తెచ్చుకుంది. ఈ సమయంలో చార్లెట్ ఒక విషయాన్నీ గుర్తించింది. రోడ్లను శుభ్రం చేయడానికి గంటల గంటల సమయం పడుతుంది. ఈ సమయంలో జరిమానా నుంచి తప్పించుకునేందుకు ప్రజలు తమ కార్లలో కూర్చుంటారు. లేదా కార్లలో తన స్నేహితులను కూర్చోబెడతారు. ఇలా గంటల పాటు అన్ని పనులు ఆపుకుని పోలీసులు తమ కార్లని తీసుకుని వెళ్ళకుండా కూర్చోవడం అంటే చాలా మందికి ఇబ్బందిగా ఉంటుందని ఆ యువతి గమనించింది. ఇవన్నీ గమనించిన చార్లేట్ ఆలోచించింది. వారి కార్లలో తాను కూర్చోవడం వలన వారికి సమయం ఆదావుతుంది. అలా కుర్చుని కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేస్తే తన ఖర్చులకు డబ్బులు వస్తాయని భావించింది.

వెంటనే తన ఆలోచనను కార్యారూపంలోకి తీసుకుని వచ్చి ‘కార్ సిట్టింగ్’ బిజినెస్‌ను మొదలు పెట్టింది. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలుపెట్టింది. రోడ్లు తుడుస్తుంటే మీ కారులో కూర్చునెందుకు తాను రెడీ అని.. తనను కార్ సిట్టింగ్ కోసం బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. దీంతో వాహన యజమానులు చార్లేట్ ను సంప్రదించడం మొదలు పెట్టారు. ఇలా తనని బుకింగ్ చేసుకోగానే.. వెంటనే వారు పంపించిన లొకేషన్ కు చేరుకొని యజమాని కారుని తీసుకుని కారు తాళం తీసిన వెంటనే ఒక వీడియో తీస్తుంది. ఎందుకంటే తాను కారులో కూర్చుని వెళ్ళిన తర్వత కారులో వస్తువులు పోయాయి. డ్యామేజ్ అయింది అనే ఫిర్యాదులు తలెత్తకుండా ముందు జాగ్రత్త తీసుకుంటుంది. అలా పనికి ముందు .. పని పూర్తి అయ్యాక కారుని వీడియో తీసి డాక్యుమెంట్ చేస్తుంది. ఇలా తన పనికి ఏ ఇబ్బంది లేకుండా ఆధారాలను కల్పించుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ఇలా సర్వీస్ ఇస్తున్నందుకు 65 డాలర్లు కంటే తక్కువగానే చార్జ్ చేస్తున్నానని.. పార్కింగ్ టికెట్ కంటే తక్కువ చార్జ్ చేస్తున్నట్లు చార్లెట్ చెప్పింది. దాదాపు 21 రోజుల క్రితం మొదలు పెట్టిన ఈ సరికొత్త బిజినెస్ ఇప్పుడు మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుంది. సక్సెస్ బాట పట్టింది. ఛార్లెట్‌కు ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్లు కూడా ఉన్నారట. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఉద్యోగం పోయిందని బాధపడకుండా తనకు అందివచ్చిన అవకాశాన్ని ఆదాయవనరుగా మార్చుకుంది. ఎందరికో ఆదర్శంగా నిలిచింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..