- Telugu News Photo Gallery Spiritual photos Kamika Ekadashi 2025: Rare Triple Yoga for Prosperity and Growth in Astrology
Auspicious Yogas: ఈ నెల 21న అరుదైన యోగాలు.. దీర్ఘాయువు, ఆయుస్సు కోసం ఎలా పుజించాలంటే..
జ్యోతిషశాస్త్రం ప్రకారం ఆషాడ మాస అమావాస్య ముందు చాలా ప్రత్యేకంగా ఉండనుంది. ఎందుకంటే ఈ నెల 21వ తేదీన మూడు శుభప్రదమైన, అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. కామిక ఏకాదశి సోమవారం నాడు ఏ అరుదైన యోగాలు ఏర్పడబోతున్నాయి? ఈ యోగాలలో పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
Updated on: Jul 16, 2025 | 9:14 AM

జ్యోతిషశాస్త్రంలో శుభ కార్యాలకు వృద్ధి యోగం చాలా అనుకూలంగా పరిగణించబడుతుంది. "వృద్ధి" అంటే పెరగడం లేదా పురోగతి సాధించడం. ఈ యోగంలో చేసే పనులు విజయాన్ని సొంతం చేసుకుంటాయి. పురోగతిని తెస్తాయి. సంపద, వ్యాపారం లేదా ఏ రకమైన వృద్ధికి సంబంధించిన పనులకు అయినా ఈ యోగం ప్రత్యేకంగా ఫలవంతమైనది. ఈ రోజున శివ పూజ చేయడం వల్ల ఆర్థిక శ్రేయస్సు , భౌతిక సుఖాలు పెరుగుతాయి.

జ్యోతిషశాస్త్రం ప్రకారం సర్వార్థ సిద్ధి యోగంలో కోరిన కోరికలను నెరవేర్చడానికి, ప్రతి పనిలో విజయాన్ని తీసుకురావడానికి శుభ యోగంగా పరిగణించబడుతుంది. సర్వార్థ సిద్ధి యోగం అంటే లక్ష్యం పూర్తి లేదా విజయం'. ఈ యోగంలో ప్రారంభించిన ఏదైనా శుభ కార్యానికి అడ్డంకులు పెద్దగా ఎదురు కావు. విజయానికి బలమైన అవకాశం ఉంది. మంత్ర సిద్ధి అనుష్ఠానం లేదా ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించడానికి ఈ యోగం ఉత్తమమైనది.

అమృత సిద్ధి యోగం జ్యోతిషశాస్త్రంలో అత్యంత పవిత్రమైనది . శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. "అమృతం" అంటే అమరత్వం "సిద్ధి" అంటే పరిపూర్ణత. ఈ యోగంలో చేసే చర్యల శుభ ఫలితాలు శాశ్వతమైనవి. అవి వ్యక్తికి దీర్ఘాయువు, ఆరోగ్యం, శ్రేయస్సును అందిస్తాయి. ఈ యోగం ప్రతికూల ప్రభావాలను నివారించడంలో, సానుకూల శక్తులను ఆకర్షించడంలో సహాయపడుతుంది.

ఆషాడ మాసం కామిక ఏకాదశి సోమవారం రోజున ఈ మూడు యోగాలు కలిసి ఏర్పడటం వలన ఈ రోజు అసాధారణమైనది శక్తివంతమైనది పవిత్రమైనదిగా పరిగణింపబడుతున్నది. మతపరమైన కార్యకలాపాలు, పూజలు లేదా ఏదైనా కొత్త శుభకార్యం అనంతమైన రెట్లు ఎక్కువ ఫలితాలను అందించడంలో ఇది చాలా అరుదైన యాదృచ్చికం.

ఈ శుభ యోగాల నుంచి గరిష్ట ప్రయోజనాన్ని పొందడానికి, ఈ రోజున శివునికి ప్రత్యేక పూజ చేయాలి. శివలింగానికి జలాభిషేకం, దధ్యాభిషేకం చేయండి. బిల్వ పత్రం, ఉమ్మెత్త, జమ్మి మొదలైనవి సమర్పించండి. "ఓం నమః శివాయ" అనే మంత్రాన్ని జపించండి. శివ చాలీసా, రుద్రాష్టకం లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం కూడా చాలా ఫలవంతమైనది. మీ కోరికలు నెరవేరాలనే సంకల్పంతో పూజ చేయండి.

ఈ యోగాలలో దానధర్మాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పేదలకు, అవసరం అయిన వారికీ దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది. గ్రహాల ప్రతికూలత తొలగిపోతుంది. కొత్త పనిని ప్రారంభించడానికి, పెట్టుబడి పెట్టడానికి లేదా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఈ రోజు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.




