Viral News: ఆ దేశంలో వింత సంప్రదాయం.. తల్లి బతికి ఉండగానే శవపేటికను తెచ్చే తనయులు.. ఎందుకంటే
మన పొరుగు దేశం చైనాలో చాలా వింత సంప్రదాయాలు ఉన్నాయి. ఈ వివిధ సంప్రదాయాల ద్వారా ప్రపంచంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. అదేవిధంగా చైనా ప్రస్తుతం ఒక వింత సంప్రదాయంతో వార్తల్లో నిలిచింది. ఈ వింత సంప్రదాయం ఏమిటంటే.. తల్లి దీర్ఘాయుస్సు ని కోరుకుంటూ కొడుకు చేసే పని.. తల్లి బతికి ఉండగానే ఒక శవపేటికను ఊరేగింపుగా వెళ్లడం. ఇలా చేయడం వలన తల్లి ఆయుష్షు పెంచుతుందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.

కొన్ని దేశాల వింత ఆచారాల గురించి మనం విన్నప్పుడు లేదా అలాంటి ఆచారాలకు సంబంధించిన వీడియోలు చూసినా ఇది నిజమేనా అంటూ ఆశ్చర్యపోతాం. అంతేకాదు అసలు ఈ ఆచారాలు ఎందుకు ఉన్నాయి తెలుసుకోవాలని భావిస్తాం. ఇప్పుడు చైనాలోని ఒక గ్రామంలో ప్రత్యేకమైన ఆచారం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఎక్కడైనా శవపేటికను మరణం తర్వాత మాత్రమే ఇంటికి తీసుకువస్తారు.. అయితే ఈ గ్రామంలో మాత్రం శవపేటికను మరనించాల్సిన వ్యక్తి బతికి ఉన్నప్పుడు తీసుకువస్తారు. వృద్ధులను అందులో ఉంచుతారు. ఇదే ఈ గ్రామం ఆచారం. చైనాలోని ఈ గ్రామంలో ఇలాంటి ఆచారాన్ని నేటికీ పాటిస్తున్నారు. ఈ గ్రామంలోని ఒక వ్యక్తి తన తల్లి కోసం ఒక శవపేటికను తయారు చేసియించి ఆమె తల్లిని ఆ శవపేటికమీద ఉంచి..ఆమెను ఊరేగించాడు. ఈ వింత ఆచారం వెనుక ఉన్న నమ్మకం వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
ఇది చైనాలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే ఒక ఆచారం. ఇది జీవితానికి, దీర్ఘాయువుకు చిహ్నం. శవ పేటికను తీసుకుని రావడం సంప్రదాయం అని చెబుతారు. ఎవరి ఇంట్లో అయినా 70 ఏళ్లు నిండిన వ్యక్తీ ఉంటే.. వెంటనే.. అతను తన కోసం ఒక శవపేటికను తయారు చేసుకుని ఇంట్లో ఉంచుకుంటాడు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అతను తన దైనందిన జీవితంలో ఆ శవపేటికను ఉపయోగిస్తాడు. ఈ ప్రత్యేకమైన ఆచారం ఆయుర్దాయం పెంచుతుందని, వ్యక్తిని మానసికంగా మరణానికి సిద్ధం చేస్తుందని నమ్ముతారు. మరణం, శవపేటిక భయంకరం విషయాలు కాదు.. ప్రతి మనిషి మనస్పూర్తిగా అంగీకరించాల్సిన విషయాలు… గౌరవానికి చిహ్నం అని చెబుతారు. అందుకనే ఈ గ్రామాల్లో వృద్ధులు ఉంటే.. ఆ ఇంట్లో శవపేటికను ముందుగా ఉంచడమే కాదు జీవించి ఉన్న వ్యక్తి అంత్యక్రియలను కూడా ఒక పండగలా చేస్తారు. ఈ వేడుకలు ‘చివరి వీడ్కోలు’ కాదని, జీవితాన్ని గౌరవించే సాంస్కృతిక సంప్రదాయమని ఇక్కడి ప్రజలు చెబుతారు.
ఈ శవపేటికను తరువాత ఊరేగింపుగా తీసుకెళ్తారు. దీనిని 8 లేదా 16 మంది తీసుకువెళతారు. అక్కడి జానపద నమ్మకాలలో దీనిని ఎనిమిది అమరజీవులు లేదా ఎనిమిది వజ్రాలు అని పిలుస్తారు. ఈ సమయంలో, శవపేటికను నేలపై ఉంచకూడదు. ఇది ఒక అలిఖిత నియమం అని చెబుతారు. ఈ సమయంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోవడానికి వేలాది మంది స్వచ్ఛంద సేవకులుగా నిలబడతారు. ఈ మొత్తం దృశ్యం భావోద్వేగంగా మాత్రమే కాదు.. ఇందులో ఒక సంస్కృతి కూడా కనిపిస్తుందని చూపరులు చెబుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




