హమ్మయ్య..ఇక్కడ దాక్కుంటే ఎవరికీ కనిపించను వీడియో
పిల్లలు చేసే అల్లరి పనులు ఒక్కోసారి తెగ నవ్వుతెప్పిస్తాయి. ఈ విషయంలో జంతువులు కూడా ఎలాంటి మినహాయింపు లేదని ఓ పిల్ల ఏనుగు నిరూపించింది. తాజాగా తల్లి ఏనుగు లేకుండా అర్ధరాత్రి ఓ పిల్ల ఏనుగు చెరకు తోటలో దొంగతనానికి వచ్చింది. తనకు ఇష్టమైన చెరకును ఆనందంగా తినసాగింది. ఇంతలో అలికిడికి తోట యజమాని వచ్చేశాడు. దీంతో భయపడిన ఈ ఏనుగుపిల్ల ఎటెళ్లాలో తెలియక రోడ్డు మీదకు వచ్చి.. ఓ కరెంట్ స్తంభం వెనుక దాక్కుని కళ్లుమూసుకుంది.
హమ్మయ్య నన్నెవ్వరూ చూడట్లేదులే అనుకుని కిమ్మనకుండా నక్కింది. తీరా వాహనంలో రోడ్డు మీదకు వచ్చిన తోట యజమాని పిల్ల ఏనుగు అమాయకత్వానికి.. అతని కోపం కాస్త కరిగిపోయి గట్టిగా నవ్వేశాడు.దొంగతనానికి వచ్చిన పిల్ల ఏనుగు నక్కేదేదో పొదల్లోనో, చెట్టుమాటునో ఉండాలి కదా..! పొలానికి సమీపంలో విద్యుత్ స్తంభం కనిపించే సరికి.. వెంటనే వెళ్లి దాని వెనుక దాక్కుని గట్టిగా కళ్లు మూసేసుకుంది. ఇక తానెవరికీ కనబడనని అనుకుంది. ఈ జంబో కిడ్ చేసిన విఫల ప్రయత్నానికి చేను యజమాని జాలిగా ఆ చిట్టి ఏనుగును తన ఫోన్‌లో క్లిక్ మనిపించాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో పోస్టు చేసి, పిల్ల ఏనుగు దొంగతనాన్ని వివరించాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ ఫొటో చూసినవారంతా తెగ నవ్వుతున్నారు. ‘హే.. అలా దాక్కోకూడదు. ఈ మనుషులు నీకు తప్పుగా నేర్పించారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. ‘జరిగిందేదో జరిగిపోయింది కాస్త కామ్‌గా ఉండు జంబో కిడ్’ అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ పెట్టారు. అన్నట్లు ఈ సంఘటన ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదూ… థాయ్‌లాండ్‌లో జరిగింది. ఈ బుజ్జి ఏనుగు భారతీయ ఏనుగట. ఇది ఆసియా ఏనుగుల ఉపజాతికి చెందింది. వీటి చిన్న చెవులు ఆఫ్రికన్ జాతి ఏనుగుల నుంచి వేరు చేస్తాయి. 2025 నాటికి థాయిలాండ్‌లో 4,422 అడవి ఏనుగులు ఉన్నాయని అంచనా.
మరిన్ని వీడియోల కోసం :
ఆలియాకు మాజీ పీఏ టోకరా..ఏకంగా రూ.77 లక్షలు వీడియో
వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో
ప్లాస్టిక్‌ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
