డేంజర్: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోతున్నారా? వీడియో
మనలో చాలా మంది రోజంతా ఫోన్‌లను ఉపయోగించి, రాత్రి పడుకునే ముందు వాటిని ఛార్జ్ చేస్తుంటారు. ఉదయం నిద్రలేచి ఛార్జర్ నుండి ఫోన్‌ను అన్‌ప్లగ్ చేసే వరకు అది అలాగే ఉంటుంది. బ్యాటరీ 100 శాతం కెపాసిటీకి చేరుకున్నప్పటికీ, ఫోన్ రాత్రంతా ఛార్జింగ్‌లోనే ఉంటుంది. చాలా మంది ఎక్కువగా చేసే ఈ తప్పు తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది మీకు హానిచేయని అలవాటు అనుకోవచ్చు. కానీ, మీకు తెలియకుండానే మీ ఫోన్ జీవితకాలాన్ని తగ్గిస్తుంది. మీ భద్రతను కూడా ప్రమాదంలో పడేస్తుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు 100శాతానికి చేరుకున్న తర్వాత ఛార్జింగ్‌ను ఆపివేసేంత సమర్థవంతమైనవి కావు. పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత కూడా మీ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్ పనుల కోసం తక్కువ మొత్తంలో పవర్‌ను వినియోగిస్తూనే ఉంటుంది. దీనివల్ల అది 100శాతం కంటే తక్కువకు పడిపోతుంది. ఇది తిరిగి ఛార్జ్ చేయడానికి ట్రికిల్ ఛార్జ్ ని ప్రేరేపిస్తుంది. 99 బ్యాటరీ 1 శాతం కూడా తగ్గిన వెంటనే మళ్లీ ఛార్జింగ్ ప్రారంభమవుతుంది. ఇది ఖచ్చితంగా బ్యాటరీ జీవితకాలాన్ని ప్రభావితం చేస్తుంది. ఫోన్‌లు ఛార్జింగ్ చేసేటప్పుడు ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఇది బ్యాటరీ, ఇతర భాగాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీనికి సంబంధించి, మీ ఐఫోన్ చాలా సమయం పాటు పూర్తి ఛార్జ్‌లో ఉన్నప్పుడు, బ్యాటరీ హెల్త్ పై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.రాత్రిపూట ఛార్జింగ్ చేసేటప్పుడు బ్యాటరీ ఆరోగ్యానికి అతి పెద్ద ముప్పు వేడి. ఛార్జింగ్ వేడిని ఉత్పత్తి చేస్తుంది. మీ ఫోన్ దిండు కింద, ఒక కేసులో లేదా వెంటిలేషన్ సరిగా లేని ప్రదేశంలోఉంటే గనుక ఉష్ణోగ్రత త్వరగా పెరుగుతుంది. అధిక వేడి ముఖ్యంగా లిథియం-అయాన్ బ్యాటరీలకు హానికరం. దీనివల్ల అవి ఉబ్బుతాయి. బ్యాటరీ సామర్థ్యాన్ని కోల్పోతాయి. తీవ్రమైన సందర్భాల్లో అవి పేలిపోయే ప్రమాదం ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
ఆలియాకు మాజీ పీఏ టోకరా..ఏకంగా రూ.77 లక్షలు వీడియో
వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో
ప్లాస్టిక్‌ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
