భోజనానికి వస్తున్నా అని తల్లికి ఫోన్.. అంతలోనే.. వీడియో
ఆయనో డాక్టర్. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మందులు రాసిచ్చి ఉపశమనం కలిగిస్తాడు. అందరికీ బతుకుపై భరోసా కల్పిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపే అతనే ఊహించని రీతిలో అర్థాంతరంగా తనువు చాలించాడు. ఫోన్ చేసి అమ్మా భోజనానికి వస్తున్నా అంటూ చెప్పిన కొడుకు కోసం వేచి చూసిన ఆ తల్లిని ఓదార్చేదెవరు?
ప్రముఖ హాస్పిటల్‌లో డాక్టర్‌గా పని చేస్తున్న ఓంకార్ కవిట్కె.. భోజనం కోసం ఇంటికి వస్తున్నట్లు తల్లికి ఫోన్ చేశాడు. కారులో బయలుదేరిన అతడు ఆ తర్వాత వంతెనపై నుంచి నీటిలోకి దూకాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. 32 ఏళ్ల డాక్టర్ ఓంకార్.. జేజే హాస్పిటల్‌లో పనిచేస్తున్నాడు. జూలై 7న రాత్రి వేళ హాస్పిటల్ నుంచి కారులో బయలుదేరాడు. తల్లికి ఫోన్ చేశాడు. ఇంటికి వస్తున్నానని భోజనం చేస్తానని చెప్పాడు. అయితే ఆ రాత్రి 9.40 గంటల సమయంలో ముంబై, నవీ ముంబైను కలిపే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అయిన అటల్ సేతు బ్రిడ్జిపై కారు ఆపాడు. ఆ తర్వాత వంతెన పైనుంచి నీటిలోకి దూకాడు.ఓంకార్ నీటిలోకి దూకడాన్ని గమనించిన అక్కడి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వంతెనపై ఆగి ఉన్న కారు, అందులో ఐఫోన్ ఉండటాన్ని గమనించారు.
మరిన్ని వీడియోల కోసం :
ఆలియాకు మాజీ పీఏ టోకరా..ఏకంగా రూ.77 లక్షలు వీడియో
వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో
ప్లాస్టిక్‌ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
