గంజిని పారబోస్తున్నారా.. ఇలా వాడితే ఎన్నో ప్రయోజనాలో వీడియో
జుట్టు రాలడం, చిట్లడం , చుండ్రు సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. దీంతో ఎక్కువ మంది మార్కెట్లో లభించే ఖరీదైన షాంపూలు, కండిషనర్లను వాడుతుంటారు. కానీ, ఇంట్లో మనం వృథాగా పారబోసే అన్నం వార్చిన గంజి ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. చైనీస్, కొరియన్ బ్యూటీ కేర్‌లో గంజికి ప్రత్యేక ప్రాధాన్యమూ ఇస్తుంటారు. మరి దీన్నెలా వాడాలి? ఆ లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గంజిలో ఇనోసిటాల్ అనే కార్బోహైడ్రేట్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇస్తుంది. అలాగే ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. గంజిలో కాస్త నిమ్మరసం కలిపి కురులకు పెడితే మెరుపూ కనిపిస్తుంది. ఉడికించిన అన్నం నీళ్లల్లో విటమిన్ బి, ఇ, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వెంట్రుకలకు పోషణ అందించి ఆరోగ్యంగా, దృఢంగా మారుస్తాయి. గంజిని కండిషనర్‌గా వాడితే జుట్టు చిట్లడం తగ్గుతుంది. అలాగే పొడవు కూడా పెరుగుతుంది.గోరువెచ్చగా ఉన్నపుడే గంజిని తలకు పట్టించి ఓ పదిహేను నిమిషాలు వదిలేయండి. తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే కురులు మెత్తగా మారుతాయి. గంజిలోని నేచురల్ ప్రొటీన్… జుట్టుకి సహజంగా నిగారింపుని తెస్తుంది. జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. రోజూ వంటలోకి వండుకున్నట్లే నీళ్లుపోసి బియ్యాన్ని ఉడకబెట్టుకోవాలి. చిక్కని గంజిని తర్వాత గిన్నెలోకి ఒంపుకోవాలి. వారానికి కనీసం రెండు సార్లు ఇలా చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. నిపుణుల సూచనల మేరకే మేం మీకు ఈ సమాచారం అందించాం. ఆరోగ్య సమస్యలున్నవారు ఈ టిప్స్ పాటించే ముందు వైద్య సలహా తీసుకోవడం మంచిది.
మరిన్ని వీడియోల కోసం :
ఆలియాకు మాజీ పీఏ టోకరా..ఏకంగా రూ.77 లక్షలు వీడియో
వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో
ప్లాస్టిక్‌ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
