Rajasthan CCTV Video: నడిరోడ్డుపై సినీ ఫక్కీలో సర్పంచ్ కారును చుట్టుముట్టి దాడి… సీసీటీవీ కెమెరాలో రికార్డ్
రాజస్థాన్‌లో ఓ సర్పంచ్‌పై సినీ ఫక్కీలో దాడి జరిగింది. నడిరోడ్డుపై సర్పంచ్ కారును గుర్తు తెలియని వ్యక్తులు చుట్టుముట్టి దాడికి దిగారు. దాడి దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో కకోడా సర్పంచ్ సందీప్ డల్లా ఆయన అనుచరుడు దేవిసింగ్ ఓలా తృటిలో...

రాజస్థాన్‌లో ఓ సర్పంచ్‌పై సినీ ఫక్కీలో దాడి జరిగింది. నడిరోడ్డుపై సర్పంచ్ కారును గుర్తు తెలియని వ్యక్తులు చుట్టుముట్టి దాడికి దిగారు. దాడి దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో కకోడా సర్పంచ్ సందీప్ డల్లా ఆయన అనుచరుడు దేవిసింగ్ ఓలా తృటిలో తప్పించుకున్నారు. డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ సంఘటన సూరజ్‌గఢ్‌లోని బరాసియా కళాశాల సమీపంలో మంగళవారం జరిగింది. పట్టపగలు జరిగిన ఈ దాడితో స్థానికంగా భయాందోళన నెలకొంది.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, దుండగులు మూడు వాహనాల్లో వచ్చారు. వారు మొదట సర్పంచ్ వాహనాన్ని ముందు మరియు వెనుక నుంచి వాహనాలతో ఢీకొట్టారు. ఆపై మూడో వాహనంలో నుంచి దిగిన దుండగులు కర్రలు, రాడ్‌లతో వాహనంపై దాడి చేశారు. అద్దాలను పగలగొట్టి, డ్రైవర్‌పై దాడి చేశారు. ఆ సమయంలో సర్పంచ్ అతని అనుచరుడితో వాహనంలోనే ఉన్నారు. కారులో నుంచి చాకచక్యంగా బయటపడిన సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.
వీడియో చూడండి:
తనను హతమార్చడానికే దుండగులు దాడి చేశారని సర్పంచ్ సందీప్ డల్లా తెలిపారు. సకాలంలో కారు దిగి పారిపోకపోతే ఇద్దరం చనిపోయేవారమని అన్నారు. దుండగులను గుర్తించి కఠిన శిక్ష విధించాలని ఆయ డిమాండ్ చేశారు.
ఈ దాడి వ్యక్తిగత శత్రుత్వం వల్లనే జరిగిందా లేక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో సర్పంచ్ సందీప్ డల్లా తన ప్రత్యర్థులతో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు అటువైపు ఫోకస్ పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.
