AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rudrabhishek: శ్రావణ మాసంలో శివయ్యకు రుద్రాభిషేకం చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో..

పురాణ గ్రంథాలు, పురాణాల ప్రకారం శివుని ఆశీస్సులు పొందడానికి రుద్రాభిషేకం ఉత్తమ మార్గం. కొన్ని ప్రత్యేక తిథుల్లో చేసే రుద్రాభిషేకం మరింత ప్రయోజనకరంగా మారుతుంది, ప్రదోషం, మాస శివరాత్రి, మహా శివరాత్రి, శ్రావణ, కార్తీక మసాల సమయంలో శివయ్య అనుగ్రహం కోసం రుద్రాభిషేకం చేయడం వలన అనేక రకాల ఫలితాలు అది కూడా అనేక రెట్లు పెరుగుతాయని నమ్మకం. ఈ నేపధ్యంలో శ్రావణ మాసం మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకం చేయడం వలన కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం..

Rudrabhishek: శ్రావణ మాసంలో శివయ్యకు రుద్రాభిషేకం చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో..
Rudrabhishekam
Surya Kala
|

Updated on: Jul 23, 2025 | 12:08 PM

Share

శివునికి రుద్రాభిషేకం చేయడం వల్లనే రాముడు రావణుడిని జయించాడు. శివుడికి రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం. ఆచారాల ప్రకారం రుద్రాభిషేకం చేసే వారి జాతకంలోని అన్ని దోషాలు తొలగిపోతాయని, శివుడు భక్తుడి కోరికలన్నింటినీ నెరవేరుస్తాడని నమ్ముతారు. రుద్రాభిషేకం అన్ని బాధల నుంచి విముక్తి పొందటానికి సులభమైన మార్గం అని నమ్ముతారు. ఇది అన్ని రకాల ఇబ్బందుల నుంచి విముక్తిని కలిగిస్తుంది. శివుడు అన్ని బాధలను నాశనం చేస్తాడని శాస్త్రాలు వర్ణించాయి. రుద్రాభిషేకం చేయడం ద్వారా జాతకంలోని దోషాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు.

రుద్రాభిషేకం చేసే సమయంలో చదవాల్సిన మంత్రం

రుద్రాభిషేకంలో ముఖ్యమైన మంత్రం “ఓం నమో భగవతే రుద్రాయ”. ఇది శివుని ఉగ్రరూపమైన రుద్రుడిని స్తుతించే మంత్రం. రుద్రాభిషేకం సమయంలో ఈ మంత్రంతో పాటు నమకం, చమకం, పురుష సూక్తం వంటి మంత్రాలను కూడా పఠిస్తారు.

ఎలా చేయాలంటే

రుద్రాభిషేకం అనేది శివలింగానికి పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి మొదలైన వాటితో అభిషేకం చేసే ఒక పవిత్రమైన ఆచారం

ఇవి కూడా చదవండి

రుద్రాభిషేకం ప్రయోజనాలు:

విశ్వాసాల ప్రకారం శివునికి రుద్రాభిషేకం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శివునికి రుద్రాభిషేకం చేయడం వల్ల సంపద వస్తుంది. శివునికి రుద్రాభిషేకం చేయడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి.

  1. తీర్థయాత్ర స్థల నీటితో శివునికి రుద్రాభిషేకం చేసిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు.
  2. రుద్రాభిషేకం చేయడం ద్వారా జన్మజన్మల పాపాలు నశిస్తాయి.
  3. రుద్రాభిషేకం చేయడం వల్ల అన్ని వ్యాధులు నశిస్తాయి.
  4. శివుడిని ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల పుత్ర సంతానం కలుగుతుంది.
  5. శివునికి రుద్రాభిషేకం చేయడం ద్వారా శత్రువులపై విజయం లభిస్తుంది.
  6. సంపదను పొందుతారు. అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. సంపద, శ్రేయస్సు , ఆర్థిక సమృద్ధిని కూడా తెస్తుందని నమ్ముతారు.
  7. రుద్ర అభిషేకం చేయడం వల్ల చెడు దృష్టి, తంత్రం నుంచి రక్షిస్తుంది.
  8. రుద్రాభిషేక పూజ ప్రతికూలతను తొలగిస్తుంది.
  9. సకల దేవతలు రుద్రునిలోనే ఉంటారు. కనుక రుద్రాభిషేకం చేయడం ద్వారా సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయి.
  10. శివ రుద్రాభిషేకం చేయడం ద్వారా కాలసర్ప దోష ప్రభావం తగ్గుతుంది.
  11. రుద్రాభిషేకం చేయడం ద్వారా జాతకంలోని అన్ని దోషాలు తొలగిపోతాయి.
  12. రుద్రాభిషేకం చేయడం వలన ఆరోగ్యం, దీర్ఘాయువును ప్రసాదిస్తుందని, ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నవారికి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు.
  13. రుద్ర అభిషేకం మానసిక ప్రశాంతతను, అంతర్గత శాంతిని చేకూరుస్తుందని, ఒత్తిడిని తగ్గిస్తుందని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.