- Telugu News Photo Gallery Spiritual photos There is a Rudraksha for each profession, If you wear it, success will be yours
ఒక్కో వృత్తికి ఒక్కో రుద్రాక్ష.. ధరిస్తే విజయం మీదే..
శివపూజలో రుద్రాక్షను సమర్పించడం వలన అనంతమైన పుణ్యం లభిస్తుందని.. రుద్రాక్షను ప్రసాదంగా భావించి ధరించడం వలన మహాదేవుని అనుగ్రహం శాశ్వతంగా ఉంటుందని విశ్వాసం. అయితే మీరు రుద్రాక్షను కోరికలకు, వృత్తి, వ్యాపారాలకు నియమానుసారం ఉపయోగించినప్పుడు ఐశ్వర్యం మరింత పెరుగుతుంది. మరి ఆ రుద్రాక్షలు ఏంటి.? ఈరోజు మనం ఈ స్టోరీలో తెలుసుకుందామా..
Updated on: Jul 23, 2025 | 2:26 PM

వ్యాపారం: మీరు ఏదైనా వ్యాపారం ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆశించిన పురోగతిని పొందలేకపోతే, ఈ కష్టాన్ని అధిగమించడానికి, వ్యాపారంలో ఆశించిన లాభం పొందడానికి, పది ముఖి, పదమూడు ఒక ముఖి, పద్నాలుగు ముఖి రుద్రాక్ష ప్రత్యేకంగా ధరించాలి.

వైద్య వృత్తి: వైద్య వృత్తిలో విజయం సాధించడానికి త్రి ముఖి, నాలుగు ముఖాలు, 09 ముఖి, 10 ముఖి, 11 ముఖి రుద్రాక్షలను ధరించాలి. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రుద్రాక్షలన్నీ వైద్యులకు, వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తులకు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి.

న్యాయ వృత్తి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు న్యాయ సంబంధిత వృత్తిలో పురోగతి సాధించడానికి, ఆశించిన విజయాన్ని పొందడానికి మీరు ప్రత్యేకంగా ఏకముఖి రుద్రాక్షను ధరించాలి. అంతేకాదు ఐదు ముఖాలు, పదమూడు ముఖాలు కలిగిన రుద్రాక్షలు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

రాజకీయం: రాజకీయ రంగంలో మీ స్థానాన్ని పదిల పరుచుకోవాలంటే.. ఈ రంగంలో మీ స్థానాన్ని, స్థాయిని పెంచుకోవాలనే కోరిక ఉంటే, మీ కోరిక నెరవేరడానికి ఏకముఖి, 13 ముఖి, 14 ముఖి రుద్రాక్షలను పూజించాలి.

ఇంజనీర్ వృత్తి: ఇంజినీరింగ్ రంగంలో విజయం సాధించడానికి ప్రత్యేకంగా 09 ముఖి లేదా 12 ముఖి రుద్రాక్షలను ధరించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రుద్రాక్ష సాంకేతిక పని చేసే వారికి చాలా పవిత్రమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది.




