- Telugu News Photo Gallery Spiritual photos Mars Transit in Virgo: Negative Impact on Zodiac Signs and Remedies Details in Telugu
Kuja Gosha: కుజ గ్రహంతో ఈ రాశులవారు జాగ్రత్త! మాంగల్య దోషం, ధన నష్టాలు
Mangalya Dosha: ఈ నెల 28(జులై) నుంచి సెప్టెంబర్ 14 వరకు కన్యా రాశిలో సంచారం చేయబోతున్న కుజుడి వల్ల కొన్ని రాశులకు అధికార యోగం, ఆదాయ వృద్ధి యోగం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, మరికొన్ని రాశుల వారు ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. కుజుడితో కలిగే సమస్యలను నివారించడానికి వీరు ప్రతి నిత్యం సుబ్రహ్మణ్యాష్టకం పఠించాల్సి ఉంటుంది. ఇతర గ్రహాల అనుకూలత వల్ల దోష తీవ్రత తగ్గే అవకాశం కూడా ఉంది. మిథునం, సింహం, కన్య, తుల, కుంభం, మీన రాశుల వారికి కన్యా రాశి కుజుడి వల్ల మాంగల్య దోషం కలగడంతో పాటు, వాహన ప్రమాదాలు, విద్యుదాఘాతాలు, ధన నష్టాలు, ఆకస్మిక అనారోగ్యాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది.
Updated on: Jul 23, 2025 | 6:46 PM

మిథునం: ఈ రాశికి చతుర్థ స్థానంలో కుజుడి సంచారం వల్ల మాంగల్య దోషం ఏర్పడింది. దీనివల్ల సుఖ నాశనం కలుగుతుంది. కుటుంబంలో టెన్షన్లు ఎక్కువగా ఉంటాయి. వాదోపవాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఆస్తి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రయాణాల వల్ల నష్టాలు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అద్దె ఇల్లు మారడం జరుగుతుంది. తల్లి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధికారుల వేధింపులు ఉండవచ్చు.

సింహం: ఈ రాశికి కుటుంబ స్థానంలో కుజ సంచారం వల్ల మాంగల్య దోషం కలిగింది. దీనివల్ల కుటుంబ జీవితం కొద్దిగా అస్తవ్యస్తంగా, ఆందోళనకరంగా మారే అవకాశం ఉంటుంది. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామితో వాగ్వాదాలు, విభేదాలు, వివాదాలకు అవకాశం ఉంటుంది. మాట తొందరపాటు వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పొరపాట్లు జరుగుతాయి. వ్యాపారాల్లో ధన నష్టం జరిగే అవకాశం ఉంది. మనశ్శాంతి తగ్గుతుంది.

కన్య: ఈ రాశిలో కుజ సంచారం వల్ల ఈ రాశివారికి మాంగల్య దోషం (కుజ దోషం) కలుగుతుంది. దీని వల్ల అనారోగ్యంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కోపతాపాలు, అసహనాలు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో సామరస్యం, అన్యోన్యత బాగా తగ్గుతాయి. రక్తం, ఎముకల సంబంధమైన సమస్యలు కలుగుతాయి. ఇష్టమైన బంధుమిత్రులు దూరమవుతారు. ధన నష్టం కలిగే అవకాశం ఉంది.

తుల: ఈ రాశికి వ్యయ స్థానంలో కుజుడి ప్రవేశం వల్ల అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు బాగా తగ్గుతాయి. దూర ప్రాంతానికి లేదా ఇష్టం లేని ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సమస్యల ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. వ్యాపారాల్లో లాభాలు మందగిస్తాయి. అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు బాగా పెరుగుతాయి.

కుంభం: ఈ రాశికి అష్టమ స్థానంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి అనేక విధాలైన ఒత్తిడి ఉంటుంది. వ్యసనాలకు అలవాటుపడే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. రావలసిన డబ్బు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. రుణదాతల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆస్తి వివాదాల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ధన నష్టం ఎక్కువగా ఉంటుంది.

మీనం: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో తీవ్ర స్థాయి విభేదాలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. దాంపత్య జీవితంలో టెన్షన్లు పెరుగుతాయి. ప్రతి పనిలోనూ ఒత్తిడి, వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. పెళ్లి ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాల వల్ల నష్టాలు తప్ప లాభం ఉండకపోవచ్చు. వాహన ప్రమాదాలకు, విద్యుదాఘాతాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి వృద్ధి చెందుతుంది.



