- Telugu News Photo Gallery Gajalakshmi Raja Yoga will bring good luck to these zodiac signs in two more days
గజలక్ష్మీ రాజయోగం.. మరో రెండు రోజుల నుంచి వీరికి అదృష్టమే!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక వలన శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే ఈ సారి శ్రావణ మాసంలో ఎంతో శక్తి వంతమైన గజలక్ష్మీ రాజయోగం ఏర్పడ నుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అఖండ రాజయోగం ఏర్పడుతుంది. కాగా ఆ రాశులు ఏవి? ఏ రాశుల వారికి శ్రావణ మాసం అద్భుతంగా కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.
Updated on: Jul 24, 2025 | 2:05 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే జులై 26వ తేదీన శుక్రుడు వృషభరాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అలాగే ఇప్పటికే మిథున రాశిలో బృహస్పతి కూడా సంచార దశలో ఉండడం వల్ల ఈ రెండు గ్రహాల కలయికతో శ్రావణ మాసంలో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది.

మేష రాశి : గజలక్ష్మీ రాజయోగం వలన ఈ రాశి వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ దేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారమే కానుంది. అంతే కాకుండా వీరు శ్రావణ మాసంలో ఎప్పుడూ చాలా ఆనందంగా ఉంటారు. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. ఏ పని చేసినా వీరికి కలిసి వస్తుందంట.

మిథున రాశి : మిథున రాశి వారికి గజలక్ష్మీ రాజయోగం వలన ఏ పనుల్లో నైనా విజయం వీరి సొంతం అవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, కళారంగంలో ఉన్నవారికి అద్భుతంగా ఉంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి గజలక్ష్మీ రాజయోగం వలన పనుల్లోని ఆటంకాలు తొలిగిపోతాయి. ఆర్థికంగా కలిసివస్తుంది. చాలా రోజుల నుంచి వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు, వ్యాపారస్తులకు కలిసి వస్తుంది.

తుల రాశి : తుల రాశి వారు గజలక్ష్మీ రాజయోగం వలన జీవితంలో త్వరగా విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు అత్యధిక లాభాలు పొందుతారు.



