మహిళలకే కాదు మగవారికి కూడా గర్భనిరోధక మాత్రలు.. అందుబాటులోకి ఎప్పుడంటే?
హార్మోన్ రహిత మగ గర్భోనిరోధక మాత్రలపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. పరిశోధకులు ప్రయోగాత్మకంగా చేస్తున్న ఈ మగ గర్భనిరోధక మాత్రలపై మొదటి దశ పూర్తికాగా, అది మంచి ఫలితాలను ఇచ్చినట్లు పరిశోధకులు తెలియజేశారు. YCT అనే ట్యాబ్ లెట్, హర్మోన్ స్థాయిలను ప్రభావితం చేయకుండా సెర్మ్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. అయితే దీని మొదటి దశ 16 మంది ఆరోగ్య వంతులనై పురుషులపై నిర్వహించగా అది ఎలాంటి దుష్పప్రభావాలు చూపెట్టలేదని వారు తెలిపారు. దీని గురించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jul 24, 2025 | 2:02 PM

గర్భనిరోధక మాత్రలు ఇప్పటి వరకు స్త్రీలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదే పురుషులలో తమ భాగస్వాములలో గర్భధారణ నివారణ కోసం కండోమ్స్, వాసెక్టమీలు రెండు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాగా, తాజగా యూనివర్శిటీ ఆఫ్ మిన్నెసోటా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పరిశోధన మొదటి సారి హర్మోన్ రహిత మగ జనననియంత్ర మాత్రలకు పునాది వేసిన విషయం తెలిసిందే.

YCT-529 అని పిలువబడే, నోటితో తీసుకునే మగ గర్భనిరోధక ట్యాబ్ లేట్. దీనిని న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయం,యువర్‌చాయిస్ థెరప్యూటిక్స్ సహకారంతో ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇది హర్మోన్ రహితంగా స్పెర్మ్ ఉత్పత్తిని నిరోధించడం ద్వారా గర్భనిరోధకంగా పనిచేస్తుందంట. అయితే దీని మొదటి దశ మంచి ఫలితాలనిచ్చింది. అయితే ఈ ట్రయల్ ఆధారంగా ఈ ట్యాబెలెట్ 180mg ఉంటుందని, తదుపరి అధ్యాయనాల ప్రకారం ,దీని ఖచ్చితమైన మోతాదు అంచనా వేస్తాం అని వారు తెలిపారు.

అలాగే మొదటి దశ ఫలితాన్ని ఇచ్చినప్పటికీ, ఈ ట్రయల్ సెర్మ్ కౌంట్ తగ్గించడంలో, గర్భధారణ నివారించడంలో దీని సామార్థ్యాన్ని అంచనా వేయలేదని, ఔషధ డెవలపర్, యువర్ చాయిస్ థెరవ్యూటిక్స్ డేటాను సేకరించడానికి ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

సైంటిఫిక్ అమెరికన్ ద్వారా జంతువులపై జరిపిన అధ్యయనాల్లో ఎలుకలలో ఈ ట్యాబ్ లేట్ వేయడం ఆపివేసిన నాలుగు నుంచి ఆరు వారాలలోపు,మానవులు కాని ప్రైమేట్లలో 10 నుంచి 15 వారాల్లో సంతానోత్పత్తి తిరిగివస్తుందని తేలిందని వారు తెలిపారు.

కండోమ్, వాసెక్టమీల వంటి వాటికంటే జనన నియంత్రణ పద్ధతులకు ఈ మాత్ర చాలా సురక్షితమైనది వారు తెలిపారు. ఇక ఈ ట్యాబ్ లెట్ ప్రస్తుతం రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉందని, దీనికి ఆమోదం లభిస్తే , మార్కెట్‌లోకి రావడానికి సంవత్సరాలు పచ్చవచ్చు, అని వారు తెలిపారు.



