- Telugu News Photo Gallery Cinema photos Is Samantha getting Married to Raj Nidimoru on this date? check Naga Chaitanya Link with it
Samantha : సమంత మరో పెళ్లి.. అతడితో కలిసి ఏడడగులు.. డేట్ ఫిక్స్.. !!
సౌత్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో సమంత ఒకరు. కొన్నాళ్లుగా పర్సనల్, అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో బిజీ అవుతుంది. మరోవైపు నిర్మాతగానూ కొత్త సినిమాలపై ఫోకస్ పెడుతుంది. తాజాగా సామ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతుంది.
Updated on: Jul 24, 2025 | 1:57 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అగ్ర హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. తక్కువ సమయంలోనే దక్షిణాదిలో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది సామ్. అయితే కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది సామ్. ఇటీవలే శుభం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో నిర్మాతగానూ పరిచయమైంది. ఇందులో కీలకపాత్రలు నటించి మరోసారి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు సమంతకు సంబంధించి ఓ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఆమె కొద్ది కాలంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే ఈ రూమర్స్ కు బలం చేకూరుస్తూ సామ్ సైతం పలుమార్లు రాజ్ తో కలిసి ఉన్న ఫోటోస్ షేర్ చేసింది.

ఇటీవల రాజ్ నిడిమోరు తో కలిసి వెకేషన్ వెళ్లిన ఫోటోస్ షేర్ చేయడంతో వీరిద్దరి డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని ప్రచారం నడుస్తున్న సమయంలోనే మరోవైపు రాజ్ నిడిమోరు భార్య పలు ఆసక్తికర పోస్టులు చేయడంతో ఈ రూమర్స్ కు మరింత బలం చేకూరింది.

తాజాగా వీరిద్దరి పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందంటూ ఇండస్ట్రీలో రూమర్స్ హల్చల్ చేస్తున్నారు. ముందుగా వీరిద్దరు ఆగస్టులోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. కానీ ఆ తర్వాత తమ పెళ్లి తేదీని అక్టోబర్ 6కు మార్చుకున్నారని టాక్. అయిత తమ పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ పై ఇప్పటివరకు సామ్, రాజ్ ఇద్దరూ స్పందించలేదు. మరీ ఈ ప్రచారంలో నిజం ఎంతవరకు ఉందో తెలియరాలేదు.




