ఆఫర్స్ కాదు, రెస్పెక్టే ముఖ్యమంటున్న సీనియర్ స్టార్ బ్యూటీస్!
ఐ వాంట్ రెస్పెక్ట్ అంటూ ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్తారు కదా.. అలా సీనియర్ హీరోయిన్లు కూడా ఇప్పుడు వి వాంట్ రెస్పెక్ట్.. మేం సీనియర్స్ అంటున్నారు. అవసరమైతే ఖాళీగా ఉంటాం కానీ అనవసరంగా మా డిమాండ్ తగ్గించుకోం అంటున్నారు. కెరీర్ చివరి దశకు వచ్చినా.. సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు సీనియర్ హీరోయిన్లు.
Updated on: Jul 24, 2025 | 3:11 PM

ఐ వాంట్ రెస్పెక్ట్ అంటూ ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్తారు కదా.. అలా సీనియర్ హీరోయిన్లు కూడా ఇప్పుడు వి వాంట్ రెస్పెక్ట్.. మేం సీనియర్స్ అంటున్నారు. అవసరమైతే ఖాళీగా ఉంటాం కానీ అనవసరంగా మా డిమాండ్ తగ్గించుకోం అంటున్నారు. కెరీర్ చివరి దశకు వచ్చినా.. సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు సీనియర్ హీరోయిన్లు.

ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు.. మేం మాత్రం లోకల్ అంటున్నారు సీనియర్ హీరోయిన్స్. పూజా హెగ్డే, సమంత, నయన్, రష్మిక తీరు ఇలాగే ఉందిప్పుడు. మామూలుగా ఆఫర్స్ రానపుడు పదో పరకో డిస్కౌంట్స్ ఇస్తుంటారు.. కానీ మనోళ్లు మాత్రం డిఫెరెంట్. ఖాళీగా కూర్చుంటాం తప్ప నో రిబేట్ అంటున్నారు. చిరంజీవి సినిమా కోసం భారీగానే తీసుకుంటున్నారు నయనతార.

సమంత అయితే తగ్గేదే లే అంటున్నారు. పుష్పలో ఒక్క పాటకే 1.20 కోట్ల వరకు తీసుకున్న ఈ బ్యూటీ.. సిటాడెల్ సిరీస్ కోసం 10 కోట్లు ఛార్జ్ చేసారు. అలాగే సినిమాకు 6 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. పైగా ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే ఉందిప్పుడు. మరోవైపు కాజల్ సైతం తగ్గేదే లే అంటున్నారు.. ఇక విశ్వంభర కోసం త్రిష 4 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.

నిడివితో పనిలేకుండా అన్ని సినిమాలు ఒప్పుకుంటున్నారు త్రిష. ఆఫర్స్ తగ్గినా సినిమాకు 3 కోట్లకు తగ్గనంటున్నారు పూజా హెగ్డే. తాజాగా మోనికా సాంగ్‌కు భారీగానే తీసుకున్నారీమే. అనుష్క రేంజ్ ఎప్పుడూ 4 కోట్లకి పైనే ఉంటుంది.

ఇక శృతి హాసన్ క్యారెక్టర్ చిన్నదైనా పెద్దదైనా 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. రష్మిక రేంజ్ ఆకాశంలో ఉందిప్పుడు. ఏదేమైనా సీనియర్స్ రాజ్యం నడుస్తుందిప్పుడు.