AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎడారిలో ప్రకృతి అద్భుతం.. ఇసుక మీద తెల్లటి వెల్వెట్ షీట్ పరుచుకుంది.. చూస్తే షాక్!

భారీ హిమపాతానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించాయి. వీటిని చూసిన జనాలు నమ్మలేకపోతున్నారు. ఎడారిలో భారీగా మంచు కురుస్తుంది. గడ్డకట్టే చలి, తెల్లటి రంగులో తివాచీలా కప్పబడిన పర్వతాలు. కానీ ఈ దృశ్యం స్విట్జర్లాండ్ కు సంబంధించినవి కాదు, సౌదీ అరేబియాలోని మండుతున్న ఎడారి ప్రాంతాల్లో వాతావరణం.

Viral Video: ఎడారిలో ప్రకృతి అద్భుతం.. ఇసుక మీద తెల్లటి వెల్వెట్ షీట్ పరుచుకుంది.. చూస్తే షాక్!
Heavy Snowfall In Saudi Arabia
Balaraju Goud
|

Updated on: Dec 19, 2025 | 6:57 PM

Share

భారీ హిమపాతానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించాయి. వీటిని చూసిన జనాలు నమ్మలేకపోతున్నారు. ఎడారిలో భారీగా మంచు కురుస్తుంది. గడ్డకట్టే చలి, తెల్లటి రంగులో తివాచీలా కప్పబడిన పర్వతాలు. కానీ ఈ దృశ్యం స్విట్జర్లాండ్ కు సంబంధించినవి కాదు, సౌదీ అరేబియాలోని మండుతున్న ఎడారి ప్రాంతాల్లో వాతావరణం. మీరూ షాక్ అవుతున్నారు కాదా..?

వైరల్ క్లిప్‌లు, ఫోటోలను చూసిన తర్వాత, ఈ వీడియోలు కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో సృష్టించబడ్డాయా అనే దానిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది డిజిటల్ కృత్రిమ సృష్టి కాదని, ప్రకృతి అద్భుతం అని స్పష్టమవుతోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, సౌదీ అరేబియాలోని టబుక్, ట్రోజెనా హైలాండ్స్‌లో భారీ హిమపాతం సంభవించింది.

సౌదీ గెజిట్‌లోని ఒక కథనం ప్రకారం, బుధవారం (డిసెంబర్ 17) తబుక్‌లోని జబల్ అల్-లాజ్‌లో భారీ హిమపాతం నమోదైంది. దట్టమైన పర్వతాలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్నాయి. ఉష్ణోగ్రత మైనస్ 4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. భారీ హిమపాతం, దట్టమైన పొగమంచు, బలమైన చల్లని గాలులు ఆ ప్రాంతమంతా మునిగిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

“ఎడారిలో మంచును నమ్మడం కష్టం.” అంటూ సోషల్ మీడియా వేదికగా యూజర్లు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. కానీ సౌదీ అరేబియా పర్వతాలు తెల్లటి వస్త్రాన్ని ధరించాయన్నది నిజం.

ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా వాతావరణ శాఖ స్పందించింది. తబుక్‌లోనే కాకుండా, ఖాసిమ్, హైల్, ఉత్తర రియాద్‌లలో కూడా హిమపాతం ఉంటుందని అంచనా వేసింది. ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలకు గురయ్యే ప్రమాదం ఉన్నందున, నివాసితులు, పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

సౌదీ అరేబియాలో మంచు కురుస్తున్న వీడియోః

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..