Chettinad Fish Fry: చెట్టినాడ్ స్టైల్‌ ఫిష్ ఫ్రై.. అదిరిపోయిందంటారు..

చెట్టినాడ్ స్టైల్‌లో ఏలాంటి రెసిపీలు చేసినా స్పైసీగా చాలా రుచిగా ఉంటాయి. స్పైసీ ఇష్ట పడేవారు చెట్టినాడ్ స్టైల్‌లో ఈ ఫిష్ ఫ్రై కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సాధారణంగా తినే చేపల వేపుడు కంటే ఇది మరింత రుచిగా ఉంటుంది..

Chettinad Fish Fry: చెట్టినాడ్ స్టైల్‌ ఫిష్ ఫ్రై.. అదిరిపోయిందంటారు..
Chettinad Fish Fry
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 08, 2024 | 9:42 PM

నాన్ వెజ్ అంటే ఎంత ఇష్టమో మాంసాహార ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరికి ప్రతి రోజూ ఏదో ఒక స్పెషల్ ఉండాలి. అయితే ఎప్పుడూ తినే ఒకే లాంటి ఐటెమ్స్‌ కాకుండా కొత్తగా కూడా ట్రై చేస్తూ ఉండాలి. ఫిష్ ఫ్రై అంటే చాలా మందికి ఇష్టం. కానీ ఫ్రై చేసేటప్పుడు మాత్రం కాస్త ఓపిక కావాలి. మీడియం మంట మీద జాగ్రత్తగా ఫ్రై చేయాలి. సాధారణంగా ఎప్పుడూ చేసే ఫిష్ ఫ్రై కంటే.. ఈ చెట్టినాడ్ స్టైల్‌లో ఫిష్ ఫ్రై చేయండి. ఖచ్చితంగా అదిరింది అంటారు. అంత రుచిగా ఉంటుంది. మరి ఈ చెట్టినాడ్ స్టైల్ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చెట్టినాడ్ స్టైల్ ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:

చేపలు, కారం, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ, జీలకర్ర, ఎండు మిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, మెంతులు, ధనియా పొడి, శనగపిండి, బియ్యం పిండి, ఆయిల్.

చెట్టినాడ్ స్టైల్ ఫిష్ ఫ్రై తయారీ విధానం:

ముందుగా చేపల ముక్కలను నీచు వాసన రాకుండా శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకుని అందులో.. ఉల్లిపాయ, జీలకర్ర, ఎండు మిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, మెంతులు, ధనియా పొడి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత శనగ పిండి, బియ్యం పిండి కూడా వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం చేపలకు పట్టించండి. ఆ తర్వాత ఓ అరగంట పాటు మ్యారినేట్ చేయడానికి ఫ్రిజ్‌లో ఉంచండి.

ఇవి కూడా చదవండి

నెక్ట్స్ పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేయాలి. చేప ముక్కలను వేసి రెండు వైపులగా ఎర్రగా మీడియం మంట మీద వేయించాలి. పెద్ద మంట పెడితే పైన మాడిపోయి.. లోపల ఉడకవు. కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేయాలి. లేదంటే పాన్ తీసుకుని.. కొద్దిగా ఆయిల్ వేసి షాలో ఫ్రై కూడా చేయవచ్చు. చివరంగా నిమ్మరసం పిండి కొత్తి మీర చల్లితే ఎంతో రుచికరమైన చెట్టినాడ్ స్టైల్ ఫిష్ ఫ్రై సిద్ధం.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!