AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Korrala: కొర్రలా.. అని తీసిపారేయకండి. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!

Korrala: కొర్రలా.. అని తీసిపారేయకండి. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!

Anil kumar poka
|

Updated on: Nov 08, 2024 | 9:24 PM

Share

ఆరోగ్యానికి చిరుధాన్యాలు చాలా మంచివని ఆహార నిపుణులు తరచూ చెబుతుంటారు. వాస్తవానికి కరోనా తర్వాత ప్రజల ఆహార విషయంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, పోషకాహారం తీసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో చిరుధాన్యాలకు ప్రాధాన్యత పెరిగింది. వీటిలో కొర్రలు ఒకటి.

కొర్రలు పోషకాల గని అని చెప్పవచ్చు. సాధారణంగా అందరూ చపాతీ, రొట్టెల కోసం గోదుమపిండిని వాడుతుంటారు. దీనికంటే కూడా కొర్రపిండి చాలా మంచిదంటున్నారు న్యూట్రిషన్‌ నిపుణులు. ఒక కప్పు కొర్రపిండిలో 10 గ్రాముల ప్రొటీన్‌, 7.4 గ్రాముల డయటరీ ఫైబర్‌ , 83 మిల్లీగ్రాముల మెగ్నీషియమ్‌ ఉంటాయి. అంతేకాదు, ఇంకా చాలా రకాల మైక్రోన్యూట్రియెంట్లు కొర్రలలో ఉంటాయి. కొర్రపిండిలో పీచుపదార్థాల పరిమాణం చాలా ఎక్కువ కాబట్టి దీంతో చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు. ఒక్క మలబద్ధకాన్ని నివారించుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలూ, అనర్థాలూ దూరమవుతాయి. కొర్రల్లోని ప్రోటీన్లు కండరాల్లోని కణజాలానికి మంచి బలాన్ని ఇస్తాయి.

ఈ ప్రోటీన్లే కండరాల్లో తమ రోజువారీ పనుల కారణంగా దెబ్బతినే కండరాలను రిపేర్లు చేస్తుంటాయి. దాంతో దెబ్బలు త్వరగా తగ్గడం, గాయాలు త్వరగా మానడం జరుగుతాయి. బలంగా మారిన ఈ కణజాలాలు మరింత ఎక్కువ ఆక్సిజన్‌ను గ్రహించగలుగుతాయి కాబట్టి మరింత ఆరోగ్యకరంగా ఉంటాయి. అంతేకాదు చాలాసేపు అలసిపోకుండా పనిచేయగలుగుతాయి. ఫలితంగా మనం పనిచేసే సామర్థ్యం, అలసిపోకుండా పనిచేయగల సమయం పెరుగుతాయి. అంతేకాదు, రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది.

కొర్రల్లో చాలా ఎక్కువ పరిమాణంలో ఉండే పీచు శరీరంలోని గ్లూకోజ్‌ను చాలా మెల్లగా రక్తంలో కలిసేలా చేస్తుంది. దాంతో డయాబెటిస్‌ నివారణకు ఇది బాగా తోడ్పడుతుంది. టైప్‌–2 డయాబెటిస్‌ ఉన్నవారికి కొర్రలు ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పవచ్చు. అంతేకాదు కొర్రలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇందులోని మెగ్నీషియమ్‌ వల్ల ఎముకలు మరింత పటిష్టమవుతాయి. జీవకణాల్లోని ఎంజైములు మరింత సమర్థంగా పనిచేస్తాయి. కొర్రల్లో జింక్‌ మోతాదులూ ఎక్కువే కావడంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలకు దోహదపడుతుంది. ఈ జింక్‌ వల్ల జుట్టు ఊడటం కూడా తగ్గుతుంది. థైరాయిడ్‌ పనితీరు క్రమబద్ధంగా మారుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Nov 08, 2024 09:23 PM