TTD: వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం క్షణం పాటు కలిగితే చాలన్నది కోట్లాది మంది భక్తుల ఆశ.ఇందులో భాగంగానే దేశంలోని నలు మూలలా ఉన్న శ్రీవారి భక్తులు తిరుమల కోస్తారు. సంపన్నుడి నుంచి సామాన్యుడి దాకా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నిత్యం లక్షల్లో ఉంటుంది. అయితే తిరుమల శ్రీవారిని రోజు దర్శించుకునే భక్తుల సంఖ్య 80 నుంచి 85 వేలకు మించడం కష్టంగా మారింది.
సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు పలు సేవలు విఐపి బ్రేక్ దర్శనాలు, సర్వదర్శనాలు కలిపి శ్రీవారిని భక్తులు దర్శించుకునేందుకు టిటిడి ఎంతో ప్రయత్నిస్తోంది. క్యూలైన్ మేనేజ్మెంట్ లో కొత్త కొత్త ఆలోచనలు చేస్తోంది. ఎక్కువమంది సామాన్య భక్తులకు వెంకన్న దర్శనం కల్పించాలని తపిస్తోంది. ఇందులో భాగంగానేరెండు రోజుల్లో 1,72,565 మందికి శ్రీవారి దర్శనం కల్పించినట్లు టిటిడి పేర్కొంది.శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేసే ప్రయత్నం చేసినట్లు కొత్త విధానాన్ని తెరమీదికి తెచ్చింది. వారాంతపు రోజుల్లో శని, ఆదివారాల్లో అత్యధిక మంది భక్తులకు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టినట్లు ప్రకటన విడుదల చేసింది.ఈ నేపథ్యంలో గత శని, ఆదివారాల్లో 1,72,565 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించగా శనివారం 88,076 మంది, ఆదివారం 84,489 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించింది. ఇందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. నారాయణగిరి షెడ్ల వద్ద ఏర్పాటు చేసిన సర్వీస్ లైన్ ను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. సర్వీస్ లైన్ ద్వారా క్యూలైన్ లో వేచి ఉండే సమయం తగ్గించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాక భక్తులను ఆలయం బయట కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్ లో నడిపించకుండా సర్వీస్ లైన్ ను వినియోగించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఔటర్ క్యూలైన్లు, నారాయణగిరి షెడ్ల ను నిరంతరం పర్యవేక్షించిన టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకుల సహకారంతో భక్తులకు క్యూలైన్లలో...

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

ముద్దులొలికే ఈ చిన్నారి ఫోటో వెనుక.. అంతులేని విషాదం వీడియో

రన్నింగ్ చేస్తేనే శాలరీతో పాటు బోనస్ వీడియో

సర్కారు ఆఫీసుకు దిష్టి.. పోవటానికి ఏం చేసారో తెలుసా

చోరీకి వెళ్లిన ఇంట్లోనే 3 రోజులు మకాం వేసిన దొంగ.. ఆ తర్వాత
