Healthy Fish Bhurji: ఎప్పుడైనా ఫిష్ బుర్జీ తిన్నారా.. ఇలా చేస్తే అస్సలు వదిలి పెట్టరు!
నాన్ వెజ్ అంటే ప్రాణం ఇస్తారు కొంత మంది. ముక్క లేనిదే కొంత మందికి ముద్ద దిగదు. రోజుకూ ఏదో ఒకటి ఉండాలి. చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, ఎగ్స్ ఇలా రోజుకు ఏదో ఒక నాన్ వెజ్ వంటకం గురించి తెలుసుకుంటున్నాం. వెరైటీ వంటలను నేర్చుకుంటున్నాం. సాధారణంగా చేపలతో పులుసు లేదా ఫ్రై, ఇగురు చేస్తూంటారు. కానీ ఎప్పుడైనా ఫిష్ బుర్జీ ట్రై చేశారా. ఏంటి? బుర్జీనా.. అది కూడా ఫిష్ తో ఏంటి అని అనుకుంటున్నారు. ఈజీ ప్రాసెసే.. కానీ ప్రిపేర్ చేయడమే కష్టం. అయితే టేస్ట్ మాత్రం అద్భుతంగా వస్తుంది. వెరైటీగా తినాలి..

నాన్ వెజ్ అంటే ప్రాణం ఇస్తారు కొంత మంది. ముక్క లేనిదే కొంత మందికి ముద్ద దిగదు. రోజుకూ ఏదో ఒకటి ఉండాలి. చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, ఎగ్స్ ఇలా రోజుకు ఏదో ఒక నాన్ వెజ్ వంటకం గురించి తెలుసుకుంటున్నాం. వెరైటీ వంటలను నేర్చుకుంటున్నాం. సాధారణంగా చేపలతో పులుసు లేదా ఫ్రై, ఇగురు చేస్తూంటారు. కానీ ఎప్పుడైనా ఫిష్ బుర్జీ ట్రై చేశారా. ఏంటి? బుర్జీనా.. అది కూడా ఫిష్ తో ఏంటి అని అనుకుంటున్నారు. ఈజీ ప్రాసెసే.. కానీ ప్రిపేర్ చేయడమే కష్టం. అయితే టేస్ట్ మాత్రం అద్భుతంగా వస్తుంది. వెరైటీగా తినాలి అనుకునే వారు ఇలా ఫిష్ బుర్జీని ట్రై చేయవచ్చు. వీకెండ్స్, స్పెషల్ డేస్ లో ఇది చేసుకుని తింటే.. టేస్ట్ చాలా బావుంటుంది. మరి ఈ ఫిష్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిష్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు:
చేప ముక్కలు, ఉప్పు, పసుపు, పచ్చి మిర్చి, ఉల్లి పాయలు, కరివే పాకు, నూనె, కొత్తి మీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, గరం మసాలా, ఆవాలు.
ఫిష్ బుర్జీ తయారీ విధానం:
ముందుగా చేపను బాగా కడిగి శుభ్రం చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇలా శుభ్రం చేసిన ఫిష్ కి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకుని ఓ అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని ఓ ప్లేట్ లోకి తీసుకుని.. ముక్కలపై ఉండే స్కిన్, లోపల ఉండే ముల్లను నెమ్మదిగా తీసి.. పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, కరివేపాకు వేసి వేయించాక.. ఉల్లి పాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసి గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకూ ఫ్రై చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించాలి.
ఇలా వేగిన తర్వాత చేప పొరటు, కొద్దిగా ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి వేయించాలి. ఇవి వేగాక గరం మసాలా కూడా వేసి.. రెండు నిమిషాల పాటు వేయించుకుని.. కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఫిష్ బుర్జీ సిద్ధం అవుతుంది. దీన్ని చపాతీ, రోటీ, అన్నంలో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది.