Local Manja: చూశారా కత్తితో నరికినట్లు మటన్ ఎలా తెగుతుందో.. ఇక పీకలు ఓ లెక్కా..
చైనీస్ మాంజాకే కాదు… ఇప్పుడు లోకల్ మాంజా కూడా ప్రాణాంతకంగా మారింది. నైలాన్ సింథటిక్ ఫైబర్‌పై గాజుపొడి, లోహపు చూర్ణం పూతతో తయారైన ఈ మాంజా.. తగిలితే చాలు చర్మం చీలిపోవడం కాదు, ప్రాణాలే పోతున్నాయి. అసలు ఈ మాంజా ఎంత పదునుగా ఉంది? చికెన్, మటన్ ముక్కలపై చేసిన ప్రయోగం.. ఓ షాకింగ్ రియాలిటీని బయటపెట్టింది.
దారం కాని దారంతో తయారు చేస్తూ, చైనీస్ మాంజాస్‌కు దీటుగా అమ్ముడౌతున్న లోకల్ మాంజాలు కూడా ప్రాణాలు తీస్తున్నాయ్. చుట్టుకుంటే చాలు నెత్తురోడాల్సిందే. పీకలు తెగిపోవాల్సిందే. చేతులైనా, కాళ్లయినా కట్టయిపోవాల్సిందే. మృత్యుఘంటికలు మోగిస్తున్న ఈ మాంజాకు నిజంగానే అంత పదునుంటుందా? నైలాన్ సింథటిక్ ఫైబర్‌తో తయారై, గాజుపొడి- లోహపు చూర్ణం పూత పూసి మాంజాలివి. జస్ట్ అలా తగులుకుంటేనే చాలు మనిషి చర్మమేంటి.. ఏదైనా ఇంతే. జస్ట్ శాంపిల్ చూడ్డం కోసం చికెన్, మటన్ ముక్కల మీద మాంజాల్ని ప్రయోగించి, వాటి పదును ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి మా చీఫ్ రిపోర్టర్ నూర్ మహ్మద్ ఇచ్చిన డెమో ఓసారి చూద్దాం.
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

