తగ్గేదేలే.. పందెంలో కొత్త ఒరవడి.. మేము సైతం అంటూ బరిలోకి దిగుతున్న మహిళామణులు..!
పోలీసులు ఒకపక్క చర్యలు చేపడుతున్నా.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. పందేలను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో సందడి నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం నవుడూరులో మహిళల కోసం ప్రత్యేకంగా కోడి పందేల బరి ఏర్పాటు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఈ పందేలను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో బరుల దగ్గర పందెం రాయుళ్లు, వీక్షకులతో సందడి వాతావరణం నెలకొంది. బరుల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. గతంలో లాగే ఈ సారీ కూడా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.
ఉభయగోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేల కోసం ఏపీ, తెలంగాణతో పాటు.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పందెం రాయుళ్లు తరలివచ్చారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం నవుడూరులో మహిళల కోసం ప్రత్యేకంగా కోడి పందేల బరి ఏర్పాటు చేశారు. దీంతో మహిళలు కూడా ఉత్సాహంగా ఈ కోడి పందేల్లో పాల్గొన్నారు. నవుడూరులో నిర్వహించిన ఈ కోడిపందేలను చూసేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. మరోవైపు కోడి పందేలకు సమీపంలోనే పిల్లల కోసం కూడా నిర్వహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జెయింట్ వీల్‌తో పాటు ఎగ్జిబిషన్లు, ఫుడ్ స్టాళ్లను నిర్వహిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
