AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Govt Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే 1095 ప్రభుత్వ ఉద్యోగాలు!

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(KGBV)ల్లో 2026 విద్యా సంవత్సరానికిగానూ బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన మొత్తం 1095 నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను నియమించనుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే..

AP Govt Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే 1095 ప్రభుత్వ ఉద్యోగాలు!
AP KGBV Non-teaching staff Recruitment
Srilakshmi C
|

Updated on: Jan 15, 2026 | 6:29 AM

Share

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని సమగ్ర శిక్షా సొసైటీ పరిధికి చెందిన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(KGBV)ల్లో 2026 విద్యా సంవత్సరానికిగానూ బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన మొత్తం 1095 నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను నియమించనుంది. ఇందులో టైప్‌ 3 పోస్టులు 564, టైప్‌ 4 పోస్టులు 531 ఉన్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూల ద్వారా ఈ నియామకాలు చేపడతారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే జనవరి 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.

టైప్ 3 పోస్టులు ఇవే..

  • ఒకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులు: 77
  • కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు: 134
  • ఏఎన్‌ఎం పోస్టులు: 110
  • అకౌంటెంట్‌ పోస్టులు: 11
  • అటెండర్ పోస్టులు: 28
  • హెడ్ కుక్ పోస్టులు: 22
  • అసిస్టెంట్ కుక్ పోస్టులు: 89
  • డే వాచ్ ఉమెన్ పోస్టులు: 18
  • నైట్ వాచ్ ఉమెన్ పోస్టులు: 26
  • స్కావెంజర్ పోస్టులు: 33
  • స్వీపర్ పోస్టులు: 16

టైప్ 4 పోస్టులు ఇవే..

  • వార్డెన్‌ పోస్టులు: 86
  • పార్ట్‌-టైం టీచర్‌ పోస్టులు: 122
  • చౌకీదార్ పోస్టులు: 77
  • హెడ్‌కుక్‌ పోస్టులు: 76
  • అసిస్టెంట్‌ కుక్‌ పోస్టులు: 170

హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్, వాచ్ ఉమెన్, చౌకిదార్, అటెండర్ వంటి పోస్టులకు ఎలాంటి విద్యార్హతలు లేవు. కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులకు ఇంటర్‌ లేదా డిగ్రీతోపాటు కంప్యూటర్‌ కోర్స్‌ చేసి ఉండాలి. వొకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులకు టెన్త్‌, సంబంధిత ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. ఏఎన్‌ఎం పోస్టులకు ఇంటర్‌ తోపాటు ఏఎన్‌ఎం శిక్షణ తీసుకుని ఉండాలి. వార్డెన్‌, పార్ట్‌టైం టీచర్‌ పోస్టులకు డిగ్రీతోపాటు బీఎడ్ లేదా ఎంఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయో పరిమితి జులై 1, 2025 నాటికి 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు సడలింపు ఉంటుంది.

ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ, మెరిట్‌, రిజర్వేషన్‌ ఆధారంగా జిల్లా స్థాయి సెలెక్షన్ కమిటీ తుది ఎంపిక చేస్తుంది. అర్హత కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో జనవరి 20, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత జిల్లా అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ ఆఫీసులో నేరుగా దరఖాస్తులతోపాటు అవసరమైన సర్టిఫికెట్లను అందించవల్సి ఉంటుంది. మండలాల వారీగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను జనవరి 23న విడుదల చేస్తారు. అభ్యర్థుల తొలి జాబితా జనవరి 28, తుది జాబితా లిస్ట్‌ ఫిబ్రవరి 04న విడుదల చేస్తారు. ఇంటర్వ్యూ ఫిబ్రవరి 5, 2026వ తేదీన నిర్వహిస్తారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

కేజీబీవీల్లో బోధనేతర సిబ్బంది ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఎలాంటి రాతపరీక్ష లేకుండానే 1095 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా
ఎలాంటి రాతపరీక్ష లేకుండానే 1095 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా
Horoscope Today: వారికి ఇంటా బయటా గౌరవ మర్యాదలు..
Horoscope Today: వారికి ఇంటా బయటా గౌరవ మర్యాదలు..
'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన