AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Secrets: రాత్రంతా ఉక్కిరిబిక్కిరి చేసే కలలు.. పొద్దున్నే బ్రెయిన్ ఎందుకు డిలీట్ చేస్తుందో తెలుసా?

మనం నిద్రపోయిన ప్రతిసారీ ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తాం. అద్భుతమైన వింతలు, భయంకరమైన దృశ్యాలు, ఎమోషనల్ కలలు.. కానీ కళ్లు తెరవగానే అవన్నీ గాలిలో కలిసిపోతాయి. అసలు మెదడు ఈ కలలను ఎందుకు సృష్టిస్తుంది? కేవలం నిమిషాల వ్యవధిలోనే వాటిని ఎందుకు డిలీట్ చేస్తుంది? 'ది డైలీ వై' (The Daily Why) సిరీస్ లో వెల్లడైన ఈ విస్తుపోయే నిజాలను చూద్దాం..

Brain Secrets: రాత్రంతా ఉక్కిరిబిక్కిరి చేసే కలలు.. పొద్దున్నే బ్రెయిన్ ఎందుకు డిలీట్ చేస్తుందో తెలుసా?
Science Of Dreaming
Bhavani
|

Updated on: Mar 18, 2026 | 7:16 PM

Share

శాస్త్రవేత్తల ప్రకారం, మనం రాత్రికి 4 నుండి 6 కలలు కంటాం. కానీ నిద్రలేచి కూర్చునే లోపే 90 శాతం కలలు మాయమైపోతాయి. దీని వెనుక మన మెదడులోని ‘హిప్పోకాంపస్’ ‘నోర్‌పైన్‌ఫ్రైన్’ (Norepinephrine) అనే కెమికల్ మధ్య జరిగే యుద్ధమే ప్రధాన కారణం. మరి కలలు మన జ్ఞాపకశక్తిని ఎలా మెరుగుపరుస్తాయి? కొన్ని కలలు మాత్రమే మనకు ఎందుకు గుర్తుంటాయి? అనే సైన్స్ మిస్టరీని ఇప్పుడు విశ్లేషిద్దాం..

కలలు ఎలా పుడతాయి?

మెదడులోని REM (Rapid Eye Movement) అనే దశలో కలలు ఎక్కువగా వస్తాయి. ఈ సమయంలో మెదడు మేల్కొని ఉన్నప్పటి కంటే యాక్టివ్‌గా ఉంటుంది.

హిప్పోకాంపస్: ఆ రోజంతా జరిగిన విషయాలను జ్ఞాపకాలుగా మారుస్తుంది.

అమిగ్డాలా: ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుంది. అందుకే కలల్లో భయం, ఆందోళన ఎక్కువగా ఉంటాయి.

ప్రీఫ్రంటల్ కార్టెక్స్: లాజిక్ (తర్కం) చెప్పే ఈ భాగం నిద్రలో ఆగిపోతుంది. అందుకే కలలు వింతగా, అర్థం పర్థం లేకుండా ఉంటాయి.

ఎందుకు మర్చిపోతాము?

కెమికల్ లోపం: మేల్కొని ఉన్నప్పుడు జ్ఞాపకశక్తికి సాయపడే ‘నోర్‌పైన్‌ఫ్రైన్’ అనే కెమికల్ నిద్రలో పడిపోతుంది. అందుకే మెదడు ఆ కలలను ‘సేవ్’ చేయదు.

హిప్పోకాంపస్ రెస్ట్: జ్ఞాపకాలను నిక్షిప్తం చేసే హిప్పోకాంపస్ నిద్రలో పూర్తి స్థాయిలో పని చేయదు.

కొత్త ఇన్ఫర్మేషన్: నిద్రలేవగానే బయట వాతావరణం, శబ్దాలు వంటి కొత్త సమాచారం మెదడులోకి చేరి, బలహీనమైన కలల జ్ఞాపకాలను తుడిచిపెట్టేస్తాయి.

కొన్ని కలలు ఎందుకు గుర్తుంటాయి?

మీరు REM నిద్రలో ఉండగా అకస్మాత్తుగా మెలకువ వస్తే ఆ కల గుర్తుండే అవకాశం ఉంటుంది.

తీవ్రమైన భావోద్వేగాలు లేదా వింత సంఘటనలతో కూడిన కలలను మెదడు బలవంతంగా గుర్తుంచుకుంటుంది.

చిన్న చిట్కా: మీకు వచ్చిన కలలు గుర్తుండాలంటే, నిద్రలేవగానే లేవకుండా కళ్లు మూసుకుని ఒక 2 నిమిషాలు ఆ కలను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి.

Follow Us