AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Makar Sankranti: సంక్రాంతి రోజు ఈ పనులు చేశారంటే.. సంవత్సరం మొత్తం సకల శుభాలు మీ వెంటే?

కొత్త సవంత్సరం జనవరి నెల వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ కనబడుతుంది. గాలిపటాలు, కోడి పందేలు, పిండి వంటలు ఇలా పండగ నాలుగు రోజులు పల్లెలు మొత్తం జనాలతో కలకలలాడుతాయి. అయితే పండగరోజు కొత్త బట్ట వేసుకోవడం, గుడికి వెళ్లడం అనేది మన తాతాల నాటి నుంచి వస్తున్న ఆచారం. దీనితో పాటు మకర సంక్రాంతి రోజు కొన్ని విధివిదానాలు పాటిస్తూ కొందరి దేవుళ్లను పూజించడం ద్వారా ఆ ఏడాది మొత్తం మనకు శుభమే జరుగుతుందని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Jan 14, 2026 | 8:08 PM

Share
సంక్రాంతి అంటేనే పిండి వంటలు.. అందుకే పండగ రోజు ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ నల్ల నువ్వుల పిండితో అభ్యంగన స్నానం చేసి.. ఒక గ్లాసు పాలలో కొద్దిగా చక్కెర, తెల్ల నువ్వులు కలుపుకొని తాగాలని చెబుతున్నారు. సంక్రాంతి రోజు ఇలా చేయడం ద్వారా వారినపై శని దేవుడి అనుగ్రహం ఉంటుందని జోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.

1 / 5
సంక్రాంతి పండగ రోజు శివుడి, విష్ణుమూర్తిని పూజించడం శుభ్రప్రాయకంగా ఉంటుందని జోతిష్యులు చెబుతున్నారు. పండగ రోజు మీ ఇంట్లో ఉండే శివలింగం, లేదా శివుడి చిత్రపటం వద్ద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం, శివలింగానికి ఆవు నెయ్యితో అభిషేకం చేయడం మంచిదంటున్నారు. ఇలా చేసిన వారిపై ఏడాది మొత్తం శివుడి అనుగ్రహం వుంటుందన్నారు.

2 / 5
అలానే విష్ణుమూర్తిని పూజించేటప్పుడు మీ ఇంట్లో ఉన్న చిత్రపటం లేదా విగ్రహం దగ్గర పద్మ పుష్పాలను పెట్టి మొక్కండి. ఎందుకంటే శ్రీ విష్ణువుకు పద్మ పుష్పాలంటే ఎంతో ఇష్టం. అందుకే సంక్రాంతి రోజున ఈ పుష్పాలతో విష్ణుమూర్తిని పూజించడం మంచిది. అలానే పూజ తర్వాత విష్ణువు సహస్ర నామం చదవండి, లేదా ఎవరైరా చదివే వినండి ఇలా చేయడం ద్వారా ఆ శ్రీకృష్ణుడి కృపా ఏడాది మొత్తం మీపై ఉంటుంది. మీరు ఏ పని చేయాలనుకున్నా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.

3 / 5
అలానే పండగ రోజున ఉదయం సూర్య కిరణాలు ఎక్కడైతే పడుతాయో.. అక్కడ ఆవు పాలతో పొంగలి తయారు చేసి దాన్ని ఇంట్లోని పూజ గదిలో నైవేద్యంగా ఉంచండి. కాసేపటి తర్వాత దాన్ని ఇంటిళ్లపాది తినేయండి. ఇలా చేయడం ద్వారా శ్రీకృష్ణుడితో పాటు సూర్య భగవానుడి కృప కూడా మీ కుటుంబంపై ఉంటుంది.

4 / 5
ఇకపోతే పండగ రోజు సూర్యుడు ఉత్తరాయాణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఆ సూర్యుడిని ఆహ్వానించేందుకు ఆకాశంలోకి గాలి పటాలు ఎగురవేయాలి. దాంతో పాటు పండగ రోజు ఇంటి ముందు రథం ముగ్గు వేసి ఉంచాలి. ఇలా వేయడం ద్వారా ఆ సూర్యనారాయణుడి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. సంక్రాంతి రోజూ ఇవి పాటించడం ద్వారా మీరు ఏడాది మొత్తం సుఖ సంతోశాలతో ఉండవచ్చు.( Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం నివేదికలు ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధార్యంగా ఇవ్వబడింది. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)

5 / 5