చలికాలంలో బొప్పాయి తినడం వల్ల జలుబు, దగ్గు వస్తాయని చాలా మంది అపోహ పడుతుంటారు. అయితే బొప్పాయి జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుందని ఢిల్లీలోని జీటీబీ హాస్పిటల్ పోషకాహార నిపుణురాలు డాక్టర్ అనామికా గౌర్ తెలిపారు. విటమిన్ సి, ఫైబర్ సమృద్ధిగా ఉండే ఈ పండు చలికాలంలో ఎంతో ప్రయోజనకరం.