AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: ఖాతాదారులకు బిగ్‌ అలర్ట్.. వరుసగా మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్!

జనవరి 25 నుండి 27 వరకు వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. జనవరి 25 ఆదివారం, 26న గణతంత్ర దినోత్సవం కారణంగా, 27న బ్యాంకు ఉద్యోగ సంఘాలు (UFBU) 5 రోజుల పని దినాల డిమాండ్‌తో సమ్మెకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఖాతాదారులు ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచన.

Bank Holidays: ఖాతాదారులకు బిగ్‌ అలర్ట్.. వరుసగా మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్!
Bank Strike January 2026
Anand T
|

Updated on: Jan 15, 2026 | 6:30 AM

Share

బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్ .. ఈ నెల 25, 26, 27 తేదీల్లో వరుసగా మూడు రోజులు బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. ఎందుకంటే వారంలో ఐదు రోజుల పని దినాలు మాత్రమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) జనవరి 27న సమ్మెకు దిగనున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లు విధులు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దేశంలో ప్రస్తుతం, నెలలో రెండవ, నాల్గవ శనివారాలు మాత్రమే బ్యాంకులకు సెలవుల దినాలు అమలవుతున్నాయి. దీంతో నెలలో మిగిలిన శనివారాలను కూడా సెలవు దినాలుగా ప్రకటించాలని బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ డిమాండ్‌ నేపథ్యంలోనే జనవరి 27న భారీ సమ్మేకు దిగేందుకు బ్యాంకు సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఈ బ్యాంక్ సంఘాల నిర్ణయంతో మూడు రోజుల పాటు బ్యాంక్‌లు మూతబడనున్నాయి. జనవరి 25 ఆదివారం ఎలాగో బ్యాంకులకు సెలవు దినమే, ఇక 26న గణతంత్ర దినోత్సవం.. ఆరోజు కూడా బ్యాంకులు ఉండవు.. ఇక 27న బ్యాంక్ ఉద్యోగ సంఘాల సమ్మెతో కారణంగా బ్యాంక్‌లు క్లోజ్ అవ్వనున్నాయి. దీంతో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్‌లో మొత్తం తొమ్మిది ప్రధాన బ్యాంకులు ఉన్నాయి. ప్రభుత్వ బ్యాంకులతో పాటు, ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగులు కూడా ఇందులో ఉన్నారు. దీనితో జనవరి 27న సమ్మె కారణంగా దాదాపు అన్ని ప్రధాన బ్యాంకులు మూతబడే అవకాశాలు కనిపిస్తున్నాయి

నిజానికి మార్చి 2024లో, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, UFBU మధ్య నెలలో మిగిలిన రెండు శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించడానికి ఒక ఒప్పందం కుదిరింది. దీని కారణంగా, బ్యాంకు ఉద్యోగులు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయాలని భావించారు. ఇందులో భాగంగా, సోమవారం నుండి శుక్రవారం వరకు అదనంగా 40 నిమిషాలు పని చేయడానికి ఉద్యోగులు అంగీకరించారు. RBI కూడా దీనిని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, తరువాత కొన్ని కారణాల వల్ల అది ఆలస్యం అయింది. ఈ క్రమంలో, బ్యాంకు ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని అనేకసార్లు సమ్మె చేశారు. అయినప్పటీ దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో మరోసారి ధర్నాకు ఉద్యోగ సంఘాలు సిద్దమయ్యాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్‌ అలర్ట్.. దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్
బిగ్‌ అలర్ట్.. దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్
ఎలాంటి రాతపరీక్ష లేకుండానే 1095 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా
ఎలాంటి రాతపరీక్ష లేకుండానే 1095 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా
Horoscope Today: వారికి ఇంటా బయటా గౌరవ మర్యాదలు..
Horoscope Today: వారికి ఇంటా బయటా గౌరవ మర్యాదలు..
'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!