Gold Price Today: సంక్రాంతి రోజున షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. ఆల్‌టైం హైకి చేరిన సిల్వర్.. తులం ఎంతంటే?
Gold and Silver Price Today: రోజురోజుకూ బంగారం, వెండి ఆభరణాలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లిపోతున్నాయి. ధరల పెరుగుదలలో రెండు లోహాలు తెగ పోటీ పడుతున్నాయి. ఒక కాస్త తగ్గితే.. ఆ తర్వాతిరోజే అంతకు డబల్ పెరుగుతున్నాయి. దీంతో కొనుగోళు దారుల్లో ఆందోళన పెరుగుతోంది. ప్రస్తుతం మునెన్నడూ లేని విధం ఆల్‌టైం హకి చేరుకుంది తులం బంగారం రేటు. కాబట్టి ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold Price Today: రోజురోజుకూ బంగారం, వెండి ధరల భగ్గుమంటున్నాయి. గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు.. రెండు మూడు రోజులు నుంచి పెరుగూనే పోతున్నాయి. కొన్ని సందర్భాల్లొ ఒక్కరోజులేనే వేలల్లో బంగారం, వెండి ధరలు పెరుగుతూ వచ్చాయి. ఈ తాజా హెచ్చతగ్గుల తర్వాత మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. లక్షా 50 వేలకు చేరువలో ఉండగా. అటు వెండి ఆల్‌టైం హైకి చేరుకొని 3 లక్షలకు చేరువలో ఉంది. ఇక ప్రస్తుతం జనవరి 15వ గురువారం ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనే విషయానికి వస్తే.. దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,010గా కొనసాగుతుండగా నిన్న ఈ ధర రూ. 143,770 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,010 వద్ద కొనసాగుతోండగా నిన్న ఈ ధర రూ. 1,31,800 వద్ద స్థిరపడింది.
ఇది కూడా చదవండి: Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. వరుసగా మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్!
దేశ వ్యాప్తంగా వెండి ధరలు
ఇక వెండి విషయానికి వస్తే.. ఇది బంగారం కంటే రెట్టింపు వేగంలో దూసుకెళ్తోంది. మార్కెట్‌లో ప్రస్తుతం బంగారం కంటే వెండి ధరలు త్వరగా పెరుగుతున్నాయి. ఈ హెచ్చుతగ్గుల తర్వాత దేశవ్యాప్తంగా వెండి ధరలు చూసుకుంటే మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,90,100 వద్ద కొనసాగుతోంది. కానీ హైదరాబాద్ మాత్రం కేజీ వెండి ధర రూ ఆల్‌హైం హైకి చేరుకుంది. ఇక్కడ కేజీ వెండి ధర రూ.3,07,100 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి:Business Idea: తక్కువ పెట్టుబడితో లక్షల్లో సాంపాదన.. ఈ ట్రెండీ బిజినెస్‌పై ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే.. రోజూ ఆధాయమే
తెలుగు రాష్ట్రాల సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,010 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,010 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.1,44,010 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,010 వద్ద కొనసాగుతోంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,890 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,3,810 వద్ద కొనసాగుతోంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,010 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,010 వద్ద కొనసాగుతోంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,160గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,160 వద్ద కొనసాగుతోంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,010 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,010 వద్ద కొనసాగుతోంది.
- కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,010ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,160 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: టెక్నీషియన్ అక్కర్లేదు.. ఈ సింపుల్ టిప్స్ తెలిస్తే.. మీరు ఇంట్లోనే వాషింగ్ మెషీన్ సర్వీసింగ్ చేయొచ్చు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
