Business Idea: తక్కువ పెట్టుబడితో లక్షల్లో సాంపాదన.. ఈ ట్రెండీ బిజినెస్‌పై ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే.. రోజూ ఆధాయమే
Box Cricket Business : ప్రతి ఒక్కరికి వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటుంది. కొందరు పెట్టుబడికి డబ్బు లేక వెనకడుగు వేస్తే.. మరి కొందరు పెట్టిన తర్వాత నష్టాలు వస్తాయనే భయంతో వెనకడుగువేస్తాయి. చాలా మంది రిస్క్ లేని వ్యాపారం చేయాలనుకుంటారు. అలాంటి వారికోసమే ఒక కొత్త బిజినెస్ ఐడియాను తీసుకొచ్చా. ఈ బిజినెస్‌లో మీరు ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలూ.. రోజూ ఆదాయం పొందొచ్చే. అదెలానో తెలుసుకుందాం పదండి.

ప్రస్తుతం తీరిక లేజి జాబ్‌ల కారణంగా చాలా మంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు. తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతన్నారు. అలా వెళ్లిన ప్రతి ఒక్కరికి వైద్యులు చెప్పే సలహా ఒక్కటే.. ఎప్పుడూ కంప్యూటర్ ముందు కూర్చోవడమే కాదు.. కాస్త ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేయాలని.. దీంతో చాలా మంది సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఏవైనా ఆటలు ఆడాలని చూస్తున్నారు. ఇందుకోసం వాళ్లు డబ్బులు ఖర్చుపెట్టేందుకు కూడా సిద్దపడుతున్నారు. అయితే మన దేశంలో క్రికెట్ ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. కానీ నగరాల్లో క్రికెట్ ఆడటానికి ఎక్కువ మైదానాలు లేవు. కొంచె ఆలోచిస్తే మీరు దీన్ని వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు.
బాక్స్ క్రికెట్
అవును ఇలానే ఆలోచించిన కొందరు నగరాల్లో బాక్స్ క్రికెట్లు ఏర్పాటు చేసి చాలా డబ్బులు సంపాధిస్తున్నారు. మీరు పార్ట్టైం ఇన్కమ్ కోసం ప్రయత్నిస్తున్నా.. ఫుల్ టైం ఇన్కం కోసం ప్రయత్నిస్తున్నా.. ఇది చాలా మంచి వ్యాపారం అవుతుంది. దీనిని కోసం మీకు ఒక ఖాళీ స్థలం దొరికితే చాలు దాన్ని చుట్టూ చిన్న నెట్ కట్టి వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు.
బాక్స్ క్రికెట్ ఏలా స్టార్ట్ చేయాలి
ఈ బాక్స్ క్రికెట్ పిచ్ ప్రత్యేకత ఏమిటంటే మీరు చిన్న స్థలంలో నాలుగు వైపులా నెట్ ఏర్పాటు చేసి మధ్యలో పిచ్ రెడీ చేస్తే చాలు. అన్ని వైపులా, పైభాగంలో నెట్ ఉంటుంది. దీంలో ఇందులో క్రికెట్ ఆడేప్పుడు మీరు ఎంత గట్టిగా కొట్టినా బంతి బాక్స్ లోపలే ఉంటుంది. దీంఓత మీరు చిన్న స్థలంలో క్రికెట్ ఆడుకోవచ్చు. అందుకే పెద్ద పెద్ద మైదానాల కన్నా.. బాక్స్ క్రికెట్ ఆడేందుకు యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా దీన్ని వ్యాపార అవకాశంగా మార్చుకుని డబ్బు సంపాదించవచ్చు. బాక్స్ క్రికెట్ కోసం మీరు చేయాల్సిందల్లా సరైన ఖాళీ స్థలాన్ని ఎంచుకుని అందులో నెట్‌లను ఏర్పాటు చేయడమే. ఇందుకోసం ఎక్కవ పెట్టుబడి కూడా అవసరం లేదు. కేవలం లక్షల నుంచి 2లక్షల్లో పూర్తి చేయొచ్చు. స్థలం మీదే ఉంటే ఇంకా తక్కువ పెట్టుబడి అవుతుంది.
ఖాళీ ప్లేస్ దొరకకపోతే
మీకూ ఖాళీ ప్లేస్ దొరకపోతే మీ బిల్డింగ్ పైభాగంలో ఉన్న టెర్రస్ ప్రాంతంలో కూడా ఈ బాక్స్ క్రికెట్‌ను ఏర్పాటుచే సుకోవచ్చు. ఇలా ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని బ్యాట్స్, బంతులు, వికెట్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. దీని ద్వారా ఆదాయం ఎలా పొందాలంటే.. ఎవరైనా మ్యాచ్ ఆడేందుకు వస్తే.. వారిని నుంచి గంటల ప్రాతిపదికన మీరు ఛార్జ్ చేయవచ్చు. మీరు గంటకు రూ. 500 నుండి రూ. 1000 వరకు ఏరియాను బట్టి ఫీజు పెట్టవచ్చు. అలాగే సెల్ఫ్ ప్రాక్టీస్ కోసం బౌలింగ్ మెషీన్‌ను కూడా ఏర్పాటు చేయవచ్చు. దీని ద్వారా తక్కువ పెట్టుబడితో చాలా డబ్బు సంపాదించవచ్చు. పార్ట్ టైం ఇన్కమ్ కావాలి అనుకున్న వారికి బెస్ట్ బిజినెస్ అవుతుంది.

Box Cricket Business
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
