Bottle Gourd Juice Benefits: ఈ కాలంలో పిల్లల నుంచి యువత వరకు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇది గుండె, కిడ్నీ వంటి అవయవాలపై ప్రభావం చూపుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో సొరకాయ రసం తాగడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగి ఊబకాయం అదుపులోకి వస్తుంది. ఇది పోషకాలను అందించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.