Chicken Pepper Fry: రెస్టారెంట్ స్టైల్ చికెన్ పెప్పర్ ఫ్రైని ఇలా చేస్తే.. సూపర్ టేస్ట్ అంతే!

చికెన్ తో చేయలేని వంటలు ఏమీ లేవు. కర్రీస్, స్నాక్స్, రోల్స్, కట్ లెట్స్, చీజీ చికెన్, పిజ్జా, ఫఫ్స్, ఫ్రైలు ఇలా చికెన్ తో ఏది చేసినా సూపర్ టేస్ట్ వస్తుంది. ఇలా చెన్ తో చేసే వంటల్లో చికెన్ ఫ్రై కూడా ఒకటి. చికెన్ ఫ్రైని చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. అయితే రెస్టారెంట్ స్టైల్ లో ఒక్కసారి ఇలా చికెన్ పెప్పర్ ఫ్రై చేస్తే.. మళ్లీ మళ్లీ ఇదే చేసుకుని తింటారు. ఈ ఫ్రైడ్ రైస్ తో తినొచ్చు. స్నాక్స్, సైడ్ డిష్ గా తీసుకోవచ్చు. ఈ పెప్పర్ చికెన్ ఫ్రై బయట క్రిస్పీగా, లోపల..

Chicken Pepper Fry: రెస్టారెంట్ స్టైల్ చికెన్ పెప్పర్ ఫ్రైని ఇలా చేస్తే.. సూపర్ టేస్ట్ అంతే!
Chicken Pepper Fry
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 09, 2023 | 10:19 PM

చికెన్ తో చేయలేని వంటలు ఏమీ లేవు. కర్రీస్, స్నాక్స్, రోల్స్, కట్ లెట్స్, చీజీ చికెన్, పిజ్జా, ఫఫ్స్, ఫ్రైలు ఇలా చికెన్ తో ఏది చేసినా సూపర్ టేస్ట్ వస్తుంది. ఇలా చెన్ తో చేసే వంటల్లో చికెన్ ఫ్రై కూడా ఒకటి. చికెన్ ఫ్రైని చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. అయితే రెస్టారెంట్ స్టైల్ లో ఒక్కసారి ఇలా చికెన్ పెప్పర్ ఫ్రై చేస్తే.. మళ్లీ మళ్లీ ఇదే చేసుకుని తింటారు. ఈ ఫ్రైడ్ రైస్ తో తినొచ్చు. స్నాక్స్, సైడ్ డిష్ గా తీసుకోవచ్చు. ఈ పెప్పర్ చికెన్ ఫ్రై బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా బలేగా ఉంటుంది. ఇప్పుడు చేసే చికెన్ ఫ్రైలో మిరియాల పొడిని ఉపయోగిస్తారు. మరి ఈ పెప్పర్ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ పెప్పర్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు:

చికెన్, మిరియాలు, ఉప్పు, కారం, పసుపు, నూనె, కొత్తి మీర, కరివేపాకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీల కర్ర, చిన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి.

చికెన్ పెప్పర్ ఫ్రై తయారీ విధానం:

ముందుగా చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇందుకోసం ముందు చికెన్ ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాత్ర తీసుకుని అందులో చికెన్, ఉప్పు, పసుపు, కారం, వేడిగా ఉన్న నూనె, మిరియాల పొడి వేసి బాగా కలుపుకుని మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని ఓ గంట పాటు ఫ్రిజ్ లో ఉంచితే టేస్ట్ బావుంటుంది. వీలైతే నైట్ అంతా ఫ్రిజ్ లో ఉంచితే.. జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి.. వేడి చేసు కోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక.. చికెన్ వేసి లోపల ఉడికేలా వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు కొన్ని మిరియాలు తీసుకుని రోట్లో వేసుకుని కచ్చా పచ్చాగా దంచు కోవాలి. ఆ తర్వాత మరో కడాయి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి.. వేడెక్కాక తరిగిన అల్లం, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించు కోవాలి. ఇవి బాగా వేగాక.. జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత చికెన్ వేసి బాగా కలుపు కోవాలి. ఇక చికెన్ దించే ముందు మిరియాల పొడి, కొత్తి మీర కూడా వేసి బాగా కలుపుకుని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ చికెన్ పెప్పర్ ఫ్రై సిద్ధమవుతుంది.