AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఏంటి ఈ ఉల్లిపాయలను తింటే క్యాన్సర్ వస్తుందా?.. తెలిస్తే వెంటనే మానేస్తారు?

ఉల్లిపాయ.. ఇది లేనిదే ఇంట్లో వంటచేయడమే కుదరదు. ఎందుకంటే ఉల్లిపాయను ప్రతిరోజూ ఒకటి కంటే ఎక్కువ ఆహార పదార్థాలలో ఉపయోస్తాం. చాలా ఇళ్లలో గృహిణులు ఉల్లిపాయలు లేవంటే వంటచేయడమే మానేస్తారు. అలా ఉంటుంది వాటి క్రేజ్‌. కానీ ఈ ఉల్లిపాయల్లొ కొన్నింటిని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆవేంటో తెలుసుకుందాం పదండి.

Health Tips: ఏంటి ఈ ఉల్లిపాయలను తింటే క్యాన్సర్ వస్తుందా?.. తెలిస్తే వెంటనే మానేస్తారు?
Moldy Onions
Anand T
|

Updated on: Sep 19, 2025 | 5:09 PM

Share

సాధారణంగా ప్రతిరోజూ ఏదో ఒక ఆహారంలో మనం ఉల్లిపాయను ఉపయోగిస్తాం. ఇవి లేకుండా కూరగాయాలు చేస్తే అసలు టేస్టే ఉండదు. చాలా ఇళ్లలో, గృహిణులు ఉల్లిపాయలు లేకుండా వంట చేయమంటే అస్సలూ కుదరదని మొహం మీదే చెప్పేస్తారు. అలా ఉంటుంది వీటి క్రేజ్ మరీ. అయితే కొన్ని సార్లు ఉల్లిపాయలపై నల్ల మచ్చలు రావడం, లేదా బూజు పట్టడం జరుగుతుంది. అలాంటి వాటిని తినడం ఆరోగ్యానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును మీరు విన్నది నిజమే వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలిస్తే.. అలాంటి వాటిని తినడం మీరు ఇప్పుడే మానేస్తారు. పోషకాహార నిపుణునల ప్రకారం.. కొందరు ఉల్లిపాయలో దెబ్బతిన్న భాగాన్ని, అంటే నల్ల మచ్చలు ఉన్న ప్రాంతాన్ని తొలగించి, మిగిలిన భాగాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. కానీ ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. ఈ రకమైన బూజు ఎక్కువగా ఉల్లిపాయ లోపలి భాగంలో మాత్రమే కనిపిస్తుంది. దీనిని గుర్తించడం చాలా కష్టం అని వారు చెప్తున్నారు.

నల్లగా, బూజు పట్టిన ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

పోషకాహార నిపుణురాలు ప్రకారం, నల్ల మచ్చలు లేదా బూజు ఉన్న ఉల్లిపాయలను ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇవి మైకోటాక్సిన్ అనే రకమైన టాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తాయి, ఇది మానవ శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. అటువంటి ఉల్లిపాయలను తినడం వల్ల ఆహార అలెర్జీలు, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అవే కాకుండా వాటి వల్ల క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని ఆమె చెబుతున్నారు. కాబట్టి వాటిని శుభ్రంచేసి వినియోగించడం కన్నా.. పడేయడం బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడు ఫ్రెష్‌గా ఉండే ఉల్లిపాయలను యూజ్ చేయండి

మనం ఇలాంటి సమస్యల నుంచి దూరంగా ఉండాలనుకుంటే ఎప్పుడూ ప్రెష్‌గా ఉండే ఉల్లిపాయలు వినియోగించాలి. అవి టైప్ 2 డయాబెటిస్‌కు ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే రక్తపోటును నియంత్రించడంలోనూ సహాయపడతాయి. వేసవి ఎండలో బయటకు వెళ్ళే ముందు ఉల్లిపాయలు తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే హీట్ స్ట్రోక్ ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది.

నల్ల మచ్చలు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలను ఎలా నిల్వ చేయాలి?

ఉల్లిపాయలపై నల్ల మచ్చలు లేదా బూజు రాకుండా ఉండటానికి వాటిని సరిగ్గా నిల్వ చేయడం చాలా ముఖ్యం. చాలా మంది మళ్లీ మళ్లీ ఎవరు కొంటారని.. ఒకేసారి బల్క్‌లో కొని ఇంట్లో పెట్టుకుంటారు. ఇలా ఒకే దగ్గర ఎక్కువ మొత్తంలో నిల్వ చేయడం ద్వారా నల్ల మచ్చలు, బూజూ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు అవసరమైన ఉల్లిపాలయను అప్పుడే తెచ్చుకొండి. అలాగే మీరు తెచ్చిన ఉల్లిపాయల్ని చల్లని, తేమగా ఉండే ప్రదేశాల్లో ఉంచకండి.

NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.