Kitchen hacks: కిచెన్ క్లాత్స్ నుంచి దుర్వాసన వస్తుందా.. ఇలా చేస్తే సరి!
ఒక్కోసారి కిచెన్ క్లాత్స్ నుంచి చెడు వాసన వస్తూ ఉంటుంది. ముఖ్యంగా చలి కాలం, వర్షా కాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటిని శుభ్రంగా క్లీన్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే బ్యాక్టీరియా, క్రిములు సులభంగా వ్యాపిస్తాయి. కాబట్టి ఈ చిట్కాలు ట్రై చేయండి..
కిచెన్ క్లాత్స్‌ని అచ్చ తెలుగులో మసిగుడ్డలు అంటారు. ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. కిచెన్‌లో వంటకు ప్రత్యేకంగా ఉపయోగించే క్లాత్స్‌ని.. కిచెన్ టవల్స్, కిచెన్ క్లాత్స్ లేదా మసిగుడ్డలు అని పిలుస్తారు. వీని కేవలం కిచెన్‌లో పని చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. స్టవ్ క్లీన్ చేయడం, స్టవ్ మీద పడ్డ కూరల మరకలు, పాల మరకలను తువడటానికి, వేడి వేడి గిన్నెలు దించడానికి ఈ కిచెన్ క్లాత్స్ ఉపయోగిస్తారు. ప్రతీ వంట గదిలో ఈ పనులు సర్వ సాధారణంగా. కాస్త ధనం ఉన్నవాళ్లు.. ప్రత్యేకంగా కిచెన్ క్లాత్స్‌ని కొంటూ ఉంటారు. కానీ మధ్య తరగతి కుటుంబాలు.. చిరిగిపోయిన టవల్స్, బట్టలను ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని ఏ రోజుకు ఆ రోజు క్లీన్ చేస్తూ ఉంటారు. ప్రతీ రోజూ ఒక క్లాత్‌ని ఉపయోగిస్తారు. మరికొంత మంది రెండు రోజులు వాడతారు. ఎంత వేడి నీటిలో ముంచి క్లీన్ చేసినా ఒక్కోసారి వీటి నుంచి దుర్వాసన వస్తుంది. మరి ఈ దుర్వాసన ఎలా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వేడి నీరు సర్ఫ్:
సాధారణంగా చాలా మంది చల్ల నీటితో క్లీన్ చేస్తూ ఉంటారు. కానీ వీటికి చాలా మురికితో పాటు క్రిములు, బ్యాక్టీరియా కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వేడి నీరు ఉపయోగించడం మంచిది. వేడి నీటిలో కొద్దిగా డిటర్జెంట్ కలిపి.. అందులో ఈ కిచెన్ క్లాత్స్‌ని ఓ అరగంట పాటు నానబెట్టి.. ఆ తర్వాత సబ్బుతో ఉతకండి. నెక్ట్స్ వీటిని ఎండలో ఆరేస్తే.. దుర్వాసన పోతుంది.
నిమ్మరసం – బేకింగ్ సోడా:
కిచెన్ క్లాత్స్ నుంచి వచ్చే దుర్వాసన పోవాలంటే వేడి నీటితో వీటిని శుభ్రం చేసిన తర్వాత.. నిమ్మ రసం, బేకింగ్ సోడా కలిపిన దానిలో ఓ పది నిమిషాలు నానబెట్టండి.
షాంపూ:
కిచెన్ క్లాత్స్ నుంచి దుర్వాసన వస్తూ ఉంటే.. వేడి నీటితో ఉతికిన తర్వాత.. చల్ల నీటిలో కొద్దిగా షాంపూ వేయండి. ఈ షాంపూలో క్లాత్స్‌ని ఓ ఐదు నిమిషాలు నానబెట్టండి. ఆ నెక్ట్స్ ఎండలో ఆరేస్తే.. చెడు వాసన పోతుంది.
లిక్విడ్స్:
ఇప్పుడు మార్కెట్లో దుర్వాసను తగ్గించి మంచి సువాసన వచ్చేలా ఎన్నో రకాల బెస్ట్ లిక్విడ్స్ వస్తున్నాయి. వేడి నీటితో కిచెన్ క్లాత్స్ ఉతికిన అనంతరం.. వేడి నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.