Valentine Vacation Spots: ప్రేమికులు సేదతీరడానికి అనువైన ప్రాంతాలివే.. విహార యాత్రలకు వెళ్లే వారూ ఓ లుక్కెయ్యండి
ప్రేమికులు సంవత్సరమంతా ఎదురుచూసే వ్యాలెంటైన్ వీక్ మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతుంది. ఇప్పటికే ప్రేమలో మునిగి తేలుతున్న వారికి అలాగే జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రేమను ప్రపోజ్ చేద్దామనుకునే వారి కోసం అదిరిపోయే టూరింగ్ స్పాట్స్ ను మీ ముందుకు తీసుకొచ్చాం.

ప్రేమ అంటేనే వర్ణించలేని ఓ అనుభూతి. తాము ప్రేమించిన వారు తమ జీవిత భాగస్వామ్యులు కావాలంటూ ప్రేమను వ్యక్తపరిచే ప్రత్యేక రోజే ప్రేమికుల రోజు. అలాగే కొన్ని సంవత్సరాలుగా పాటిస్తున్న వ్యాలెంటైన్ వీక్ ను ఎంజాయ్ చేయడానికి ప్రేమికులు ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రేమికులు సంవత్సరమంతా ఎదురుచూసే వ్యాలెంటైన్ వీక్ మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతుంది. ఇప్పటికే ప్రేమలో మునిగి తేలుతున్న వారికి అలాగే జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రేమను ప్రపోజ్ చేద్దామనుకునే వారి కోసం అదిరిపోయే టూరింగ్ స్పాట్స్ ను మీ ముందుకు తీసుకొచ్చాం. మీరు వ్యాలెంటైన్ వీక్ మొత్తం సరదాగా గడపాలనుకుంటే ఈ ప్రాంతాలకు వెళ్తే సేదతీరడమే కాకుండా ప్రకృతి రమణీయతను కూడా ఎంజాయ్ చేయవచ్చు. అలాగే ప్రయాణ సమయంలో కూడా మీ భాగస్వామికి మంచి నమ్మకాన్ని కల్పించవచ్చు. ప్రేమికులకు సూచించే ఆ అందమైన పర్యాటక ప్రదేశాలపై ఓ లుక్కెద్దాం.
రాజస్థాన్
బాలివుడ్ నటులు కత్రినా కైఫ్, విక్కీకౌశల్, అలియా భట్, రణ్బీర్ కపూర్ వంటి ప్రముఖ జంటలు తరచూ రాజస్థాన్ ను సందర్శిస్తుంటారు. ఎందుకంటే రాజస్థాన్ లోని ఎన్నో ప్రాంతాల్లో ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి. అలాగే ఎడారి పర్యటనలతో పాటు చారిత్రాత్మకంగా ప్రాముఖ్యం కొన్ని రాజ భవనాలు ఆకట్టుకుంటాయి. అలాగే మరికొన్ని రాజ భవనాల్లో నెలకొల్పిన హోటల్స్ లో సేద తీరుతూ ఎంజాయ్ చేయడానికి రాజస్థాన్ ఓ మంచి పర్యాటక ప్రదేశం.
థాయిలాండ్
థాయిలాండ్ ప్రేమికులను జీవితాంతం మంచి అనుభవాలను ఇచ్చే మంచి పర్యాటన ప్రదేశం. ఇక్కడ ఉండే రిసార్ట్‌లు సేద తీరడానిిక చాలా బాగుంటాయి. షాపింగ్, థాయిలాండ్ సాంప్రదాయ భోజనం ప్రేమికులను కట్టి పడేస్తాయి.




ప్యారిస్
ప్యారిస్‌ను ప్రేమికులను అమితంగా ఆకట్టుకునే నగరం. బ్యాక్‌డ్రాప్‌లో ఈఫిల్ టవర్‌తో మీ భాగస్వామికి ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందో? ఓ సారి ఊహించుకోండి. పర్సియన్ వీధులు, భవనాలు, ఉద్యాన వనాలు మీదుగా ప్రయాణిస్తూ భాగస్వామిని అర్థం చేసుకోడానికి ప్యారిస్ చాలా బాగుంటుంది. అందువల్ల ప్యారిస్ ను ప్రేమికుల నగరంగా కొంత మంది పిలుచుకుంటారు.
టర్కీ
ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్షించే ప్రధాన నగరం. ఇది చారిత్రాత్మకంగా సుసంపన్నమైన ప్రాంతం. బీచ్‌లు, అడవులు చారిత్రాత్మక రోమన్ అద్భుతాలు వంటి వి పర్యాటకులను బాగా ఆకట్టుకుంటాయి. అలాగే ఇక్కడ ఉండే ఆహ్లాదకర వాతావరణాన్ని ప్రేమికులు చాలా బాగా ఇష్టపడతారు.
స్విట్జర్ లాండ్
కరీనా కపూర్, సైఫ్ అలిఖాన్ వంటి బాలివుడ్ నటులకు ఇష్టమైన హాలిడే డెస్టినేషన్ స్విట్జర్లాండ్. చుట్టూ కొండలు, అందమైన ప్రకృతి మంచి అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ ఉండే మంచులో హాయిగా ఆడుకోవచ్చు. అలాగే హైకింగ్‌కు వెళ్లడంతో పాటు రొమాంటిక్ డిన్నర్లను ఆస్వాదించవచ్చు. అలాగే ఇక్కడ దొరికే ప్రత్యేక వైన్ ను టేస్ట్ చేయవచ్చు. ఈ ప్రాంతాన్ని చాలా మంది ప్రేమికులు ఇష్టపడతారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..
