Life Style: హోటల్ రూమ్ లలో తెల్లని బెడ్ షీట్లు ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా..
పని, ప్రయాణం వంటి కొన్ని అవసరాల కోసం కొందరు వివిధ కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. ఆ నగరాలు, పట్టణాల్లో బస చేసేందుకు హోటళ్లకు వెళ్తుంటారు. అయితే హోటల్ రూమ్ లో తెల్లటి బెడ్‌షీట్ మాత్రమే పెట్టడం..
పని, ప్రయాణం వంటి కొన్ని అవసరాల కోసం కొందరు వివిధ కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. ఆ నగరాలు, పట్టణాల్లో బస చేసేందుకు హోటళ్లకు వెళ్తుంటారు. అయితే హోటల్ రూమ్ లో తెల్లటి బెడ్‌షీట్ మాత్రమే పెట్టడం మీరు ఎప్పుడైనా గమనించారా. తెల్లటి బెడ్ షీట్లు, దిండ్లు, టవల్స్, న్యాప్కిన్లు అన్ని వైట్ కలర్ లోనే ఎందుకు ఉంటాయనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా.. అవును, తెల్లటి బెడ్ షీట్లను ఉపయోగించటానికి ఒక కారణం ఉంది. తెల్లని వస్తువులు చాలా త్వరగా మాసిపోతాయి. మరకలు సులభంగా కనిపిస్తాయి. కాబట్టి హోటళ్లలో తెల్లటి బెడ్ షీట్లను ఉపయోగిస్తారు. తెలుపు రంగు అధిక నాణ్యత కలిగి ఉన్నందున హోటళ్లు తరచుగా తెల్లటి బెడ్ షీట్లను ఉపయోగిస్తాయి. తెల్లటి బెడ్ షీట్ శుభ్రంగా ఉంటే.. హోటల్ రూమ్ కూడా శుభ్రంగా ఉన్నట్లు కస్టమర్లు భావిస్తారు. గదిలో ఉండే వ్యక్తి మరింత సౌకర్యవంతంగా ఉండవచ్చు.
తెల్లటి బెడ్ షీట్లను ఉపయోగించడానికి మరొక కారణం ఉంది. హోటల్ క్లీనింగ్ సమయంలో బెడ్ షీట్స్ అన్నీ కలిపి ఉతుకుతుంటారు. అలా చేసే సమయంలో కలర్ పోకుండా, అంటుకోకుండా ఉండేందుకు తెల్లని దుస్తులను ఉపయోగిస్తుంటారు. తెల్లని దుస్తులతో రూమ్ ను డెకరేట్ చేయడం ద్వారా రిచ్ లుక్ వస్తుంది. తెలుపు రంగు శాంతికి చిహ్నంగా ఉంటుంది. హోటల్ గదులలో నిద్రించడానికి లేదా విశ్రాంతి తీసుకోవడానికి తెల్లటి బెడ్ షీట్లను ఉపయోగించడం బెట్టర్. తెలుపు రంగు మనస్సును ప్రశాంతంగా, సంతోషంగా ఉంచుతుంది.
హోటళ్లలో తెల్లటి బెడ్‌షీట్ల వాడకం 90ల తర్వాత మొదలైంది. అంతకు ముందు రంగుల బెడ్ షీట్లు వాడేవారు. 1990ల తర్వాత, పాశ్చాత్య హోటల్ డిజైనర్లు గదికి విలాసవంతమైన రూపాన్ని అందించడానికి, వినియోగదారులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించడానికి తెల్లటి బెడ్ షీట్లను ఉపయోగించడం ప్రారంభించారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి