AP Police Result: ఏపీ పోలీస్ అభ్యర్థులకు అలెర్ట్.. ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

AP Police Constable Results 2023: ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష ఫలితాలను ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆదివారం విడుదల చేసింది.

AP Police Result: ఏపీ పోలీస్ అభ్యర్థులకు అలెర్ట్.. ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
Ap Police Exam
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 05, 2023 | 1:12 PM

AP Police Constable Results 2023: ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష ఫలితాలను ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆదివారం విడుదల చేసింది. ఫలితాలను ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ (APSLPRB) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 95,208 మంది అభ్యర్తులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. అర్హత సాధించిన వారికి త్వరలోనే దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌ (https://slprb.ap.gov.in/) లో ఓఎంఆర్‌ షీట్లు అందుబాటులో ఉంటాయని.. అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చని పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను చెక్ చేసుకునేందుకు slprb.ap.gov.in లో లాగిన్ అయి.. వివరాలను నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఈ లింక్ క్లిక్ చేసి పరీక్ష ఫలితాలను చెక్ చేసుకోండి.. 

ఏపీ ప్రభుత్వం మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా.. గతనెల 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రాంతాల్లోని 997 పరీక్షా కేంద్రాల్లో పకడ్బంధీగా పరీక్ష నిర్వహించినట్లు రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులు తెలిపారు. అదే రోజు పరీక్షా కీ విడుదల చేసిన రిక్రూట్‌మెంట్‌ బోర్డు.. 25వ తేదీ వరకూ కీ పై అభ్యంతరాలను స్వీకరించింది.

కాగా, 200 మార్కులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో ఓసీలకు 40 శాతం, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు 30 శాతం కటాఫ్‌గా నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..