AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HPCL Recruitment: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌… హిందుస్థాన్ పెట్రోలియంలో భారీగా ఖాళీలు.

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, రిఫైనరీ డివిజన్ పలు విభాగాల్లో ఉన్న అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది...

HPCL Recruitment: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌... హిందుస్థాన్ పెట్రోలియంలో భారీగా ఖాళీలు.
Hpcl Jobs
Narender Vaitla
|

Updated on: Feb 05, 2023 | 7:39 PM

Share

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, రిఫైనరీ డివిజన్ పలు విభాగాల్లో ఉన్న అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 116 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ – ఇంజనీరింగ్ (86), టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీ (30) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలో భాగంగా సివిల్/మెకానికల్/కెమికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ /ఇన్ స్ట్రుమెంటేషన్/కంప్యూటర్ సైన్స్ /ఐటీ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీలో సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఇన్ స్ట్రుమెంటేషన్ /కెమికల్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఇంజనీరింగ్/డిప్లొమాలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 25,000, డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులకు ఎంపికైన వారికి రూ. 15,000 స్టైఫండ్‌గా అందిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 12, 2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన ఐఫోన్‌ 16 ప్లస్‌ ధర!
గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన ఐఫోన్‌ 16 ప్లస్‌ ధర!