Layoffs: ఈ సాఫ్ట్‌వేర్ జాబ్‌లేంటీ మరీ ఇలా అయ్యాయి.. ఐఐటీలో ఇంజనీరింగ్ చేసిన వారికి కూడా తప్పట్లేదుగా..
ఆర్థిక మాంద్యం, కరోనా సమయంలో ఇబ్బడిమొబ్బడిగా ఉద్యోగులను తీసుకోవడం కారణం ఏదైనా ఉద్యోగుల తొలగింపు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్న చిన్న స్టార్టప్‌లు మొదలు ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థల వరకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. రాత్రికి రాత్రి వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు...
ఆర్థిక మాంద్యం, కరోనా సమయంలో ఇబ్బడిమొబ్బడిగా ఉద్యోగులను తీసుకోవడం కారణం ఏదైనా ఉద్యోగుల తొలగింపు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్న చిన్న స్టార్టప్‌లు మొదలు ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థల వరకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. రాత్రికి రాత్రి వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు భారతీయ కంపెనీలు కూడా తామేం తక్కువ కాదనట్లు ఉన్నాయి. తాజాగా ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఆరునెలల వ్యవధిలోనే ఈ సంస్థ ఏకంగా 3000 మంది ఉద్యోగులను ఇంటికి పంపడం సంచలనం సృష్టించింది.
ఇక బైజూస్ ఉద్యోగులను తొలగించిన నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయిన వారి తమ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తాజాగా అభిషేక్ ఆశిష్ అనే ఉద్యోగి తన అనుభవాన్ని లింక్‌డిన్ ద్వారా పంచుకున్నారు. బైజూస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన ఆశిష్‌ను ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించారు. ఆశిష్ 2022 నుంచి బైజూస్‌లో పనిచేస్తున్నారు. అభిషేక్ ఆశిష్ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేయడం గమనార్హం. కేవలం తక్కువ నైపుణ్యం ఉన్న వారినే కంపెనీలు తొలగిస్తున్నాయన్న వార్తల్లో నిజం లేదని ఈ సంఘటన స్పష్టం చేసినట్లైంది.
కంపెనీ ఫ్రెషర్‌లందరినీ తొలగిస్తున్నట్లు అశిష్ తెలిపారు. బైజూస్ రెండో విడత లేఆఫ్స్ తో తన ఉద్యోగంపై కూడా ప్రభావం పడిందని ఆయన రాసుకొచ్చారు. ఇక ఏది జరిగినా అది మంచికోపమే జరుగుతుందని, జీవితంలో నాకు ఏది రాసి ఉందో అని, కొత్త సవాళ్ల కోసం వెతుకుతున్నానంటూ ఆశిష్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నానని తెలిపిన ఆశిష్.. ఎవరైనా నియామకం చేస్తుంటే తనను రిఫర్ చేయగలరని రాసుకొచ్చారు. అశిష్ చేసిన ఈ పోస్ట్‌తో సాఫ్ట్‌వేర్ రంగంలో పరిస్థితిలు మరీ ఇలా ఉన్నాయా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..