Boat House: బోట్ హౌస్‌లో ఎప్పుడైనా ఉన్నారా? సూపర్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్.. ఓ లుక్కెయ్యండి
ఎప్పటిలా కాకుండా కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేయాలని కోరుకుంటుంటాం. ఇలాంటి విలక్షణమైన ఆలోచనలు ఉన్నవారి కోసమే బోట్ హౌస్ థీమ్ స్వాగతం పలుకుతుంది. ప్రకృతి ఒడిలో సేద తీరుతూ పడవలో విహరిస్తూ ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. భారత్ లో ఇలా టూరిస్ట్ స్పాట్స్ లో కొన్ని ప్రాంతాల్లో బోట్ హౌసెస్ ఉన్నాయి. వీటిల్లో విహరిస్తూ ట్రిప్స్ ను ఎంజాయ్ చేయవచ్చు.

సాధరణంగా ఎవరైనా భూమి మీద ఇల్లు నిర్మించుకుని నివసిస్తుంటారు. అయితే నీళ్లల్లో ఇళ్లు నిర్మిస్తే ఎలా ఉంటుందో? ఎప్పుడైనా చూశారా? అవును ఈ ఆలోచన నుంచి పుట్టిందే బోట్ హౌస్ థీమ్. ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో సేదతీరాలనే ఉద్దేశంతో మనం టూర్స్ ప్లాన్ చేస్తాం. అయితే ఈ టూర్స్ లో ఎప్పటిలా కాకుండా కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేయాలని కోరుకుంటుంటాం. ఇలాంటి విలక్షణమైన ఆలోచనలు ఉన్నవారి కోసమే బోట్ హౌస్ థీమ్ స్వాగతం పలుకుతుంది. ప్రకృతి ఒడిలో సేద తీరుతూ పడవలో విహరిస్తూ ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. భారత్ లో ఇలా టూరిస్ట్ స్పాట్స్ లో కొన్ని ప్రాంతాల్లో బోట్ హౌసెస్ ఉన్నాయి. వీటిల్లో విహరిస్తూ ట్రిప్స్ ను ఎంజాయ్ చేయవచ్చు. ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న బోట్ హౌస్ ల వివరాలను ఓ సారి తెలుసుకుందాం.
శ్రీనగర్
ఇక్కడ ఉన్న దాల్ లేక్ ప్రాంతంలో బోట్ హౌస్ ఫెసిలిటీ ఉంది. మన టూర్ ను మరపురానిదిగా మార్చుకోవాలి అంటే కచ్చితంగా ఇక్కడై బోట్ హౌస్ లో విహరించాల్సిందే. ఇక్కడ బోట్ హౌస్ నాణ్యత, అలాగే ప్రకృతిలోని రమణీయత టూరిస్టులను కట్టి పడేస్తుంది.
కేరళ
కేరళలోని చాలా ప్రాంతాలు బ్యాక్ వాటర్ తో నిండి ఉంటాయి. చాలా ప్రాంతాల్లో విహరించాలనుకుంటే పడవలే దిక్కు. ఇలాంటి ప్రదేశంలో బోట్ హౌస్ లు టూరిస్టుల మనస్సును గెలుచుకుంటున్నాయి. ఇక్కడ సాంప్రదాయ హౌస్ బోట్ ను కెట్టువల్లం అంటారు. అలాగే హౌస్ బోట్స్ రాత్రి సమయంలో విహరిస్తే ఆ కిక్కే వేరు.
గోవా
గోవా అంటే చాలా మందికి బీచ్ మాత్రమే గుర్తుకువస్తుంది. అయితే ఇక్కడ కూడా హౌస్ బోట్ అందుబాటులో ఉంది. చపోరా, మండోవి నదులపై హౌస్ బోట్ విహరిస్తూ గోవా అందాలను చూస్తే మనకు మంచి అనుభూతి కలుగుతుంది. ఈ హౌస్ బోట్ లో బస చేస్తూ సాంప్రదాయ వంటకాలను రుచి చూస్తూ విహరిస్తే ఆ మజా వేరే లెవెల్లో ఉంటుంది.
ఉడిపి
ఉడిపిలో ఓ హౌస్ బోట్ ను అద్దెకు తీసుకుని స్వరణ నదిపై విహరించవచ్చు. ఈ విహారంలో కొబ్బరి తోటలు, నది పాయాల్లోని రమణీయత ప్రకృతి ప్రేమికులను ఇట్టే కట్టి పాడేస్తుంది. ఇక్కడ కేరళ తరహా హౌస్ బోట్స్ అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో అందుబాటులో ఉంటాయి.
తార్కర్లీ
ఇది మహారాష్ట్రలో ఉన్న ఏకైక బ్యాక్ వాటర్ ప్రాంతం. ఇందులో మనం హౌస్ బోటింగ్ ను ఎక్స్ పీరియన్స్ చేయవచ్చు. ఓ రోజు లేదా రెండు రోజుల సెలవుతో ఈ ప్రదేశంలో మనం ఎంజాయ్ చేయవచ్చు. ఈ బ్యాక్ వాటర్ ప్రయాణం ఎంతో మధురానుభూతిని ఇస్తుంది.
సుందర్బన్స్
కోల్ కత్తాలోని అత్యంత సహజమైన అందమైన ప్రాంతాల్లో సుందరబన్స్ ఒకటి. ఇక్కడ కూడా హౌస్ బోటింగ్ ఉంది. మడ చిత్తడి నేల గుండా వెళ్లి ప్రకృతి రమణీయతను ఆశ్వాదించవచ్చు. అలాగే మధ్యలో కనిపించే పక్షులు, జంతువులను చూస్తూ థ్రిల్ ఫీల్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ ఉండే అధునాతన సౌకర్యాలతో ఎలాంటి వాతావరణంలోనైనా ఆందోళన లేకుండా విహరించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..



