Tour Plans: సెలవుల్లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? చలికాలంలో బడ్జెట్ ఫ్రెండ్లీ పర్యాటక ప్రదేశాలివే..
ఇండియాలోనే బడ్జెట్ ఫ్రెండ్లీ టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్స్ ను మీ ముందుకు తీసుకువచ్చాం. ఇక్కడకు వెళ్తే మంచి ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేయవచ్చు. చలి గాలిలో మంచి ప్రకృతి అందాలను వీక్షించవచ్చు.

శీతాకాలం అంటేనే ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ ట్రిప్స్ వేసేందుకు అనువైన సమయం. కానీ ఇలాంటి సమయంలో మనల్ని భయపెట్టే విషయం ఒకటే..అదే బడ్జెట్. ఎక్కువ మందితో బయటకు వెళ్లినప్పుడు బడ్జెట్ కూడా మన సౌకర్యాలను ప్రభావితం చేస్తుంది. అయితే ఇండియాలోనే బడ్జెట్ ఫ్రెండ్లీ టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్స్ ను మీ ముందుకు తీసుకువచ్చాం. ఇక్కడకు వెళ్తే మంచి ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేయవచ్చు. చలి గాలిలో మంచి ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ టూరిస్ట్ ప్లేస్ లను బాగా ఇష్టపడతారు. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే ప్లేస్ లపై ఓ లుక్కెద్దాం.
గోవా
ప్రస్తుతం చలికాలంలో అందరికీ నచ్చే ప్లేస్ గోవా. చల్లని వాతావరణంలో బీచ్ లో సేదతీరితే ఆ ఎంజాయ్ మెంటే వేరు. గోవాను లాస్ వెగాస్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు. విదేశీ పోకడలతో ఉండే మంచి ప్లేస్ గోవా. ఇక్కడ తిరుగుతుంటే మనమేదైనా విదేశాలకు వచ్చామా? అనే అనుమానం వస్తుంది. ఫ్యామిలీతో కాకుండా ఫ్రెండ్స్ తో రావడానికి, బ్యాచిలర్ పార్టీలను ఎంజాయ్ చేయడానికి గోవా ది బెస్ట్ ప్లేస్
కూర్గ్ (కర్ణాటక)
సిటీ లోని బిజీ లైఫ్ టెన్షన్స్ నుంచి బయటపడడానికి ఉత్తమమైన చోటు కూర్గ్. ఇది కర్ణాటకలో ఉంది. అందమైన ప్రకృతి మనం ఇక్కడ ఆశ్వాదించవచ్చు. అలాగే ఇక్కడ ఉండే అబ్బె జలపాతం వద్ద హ్యాపీగా సేద తీరవచ్చు. గోల్డెన్ టెంపుల్, తడియాండమోల్, కూర్గ్ వైట్ వాటర్ రాఫ్టింగ్, గడ్డిగే ప్లేసెస్ ను వీక్షించవచ్చు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి కూర్గ్ మించిన ప్రదేశం ఇంకోటి లేదు.
జైసల్మీర్
రాజస్థాన్ లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. దీన్ని గోల్డెన్ సిటీగా పిలుస్తారు. ఎడారిలో ఉండే ఎత్తయిన కోటలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక్కడ ఎడారి సఫారి పర్యాటకుల మనస్సును గెలుస్తుంది. అద్భుతమైన జైసల్మిర్ కోట, జాతీయ ఉద్యానవనం, ఎడారి, జైన దేవాలయాలు, గడిసర్ సరస్సు వంటి ఎన్నో ప్రదేశాలను ఇక్కడకు వెళ్తే వీక్షించవచ్చు.
ఔలి (ఉత్తరాఖండ్)
ఔలిలోని నీల్‌కాంత్, మన పర్బత్, నందా దేవి మంచుతో కప్పబడిన కొండలు ఎత్తైన ప్రదేశాల యొక్క అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తాయి. ముఖ్యంగా స్కీయింగ్ నేర్చుకోవడానికి ఔలీ అనువైన ప్రదేశాల్లో ఒకటి.
మనాలి ( హిమాచల్ ప్రదేశ్)
ఎత్తైన పర్వాతాలు, అక్కడ ఉన్న దేవదారు చెట్లు, మలుపులు తిరిగే రోడ్ల, విస్తారమైన మంచు కారణంగా ఈ ప్రదేశం చలికాంలో మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది. నూతన వధూవరులకు, మంచు కొండల వద్ద సేదతీరేందుకు ఔత్సాహికులకు ఈ ప్రదేశం. మనాలిలో ఉండే పారాగ్లైడింగ్, ఐస్ స్కేటింగ్, రాపెల్లింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహస క్రీడలు కూడా పర్యాటకులను అబ్బుర పరుస్తాయి.







