బీ కేర్‌ఫుల్.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అనేకచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో శనివారం కురిసిన భారీ వర్షాలకు జనం తడిసిముద్దైపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు ఒకేసారి విస్తరించడంతో ఈ వర్షాలు పడ్డట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో కూడా శనివారం రాత్రి పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ […]

బీ కేర్‌ఫుల్.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు
Follow us

| Edited By:

Updated on: Oct 20, 2019 | 8:15 AM

తెలుగు రాష్ట్రాలను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అనేకచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో శనివారం కురిసిన భారీ వర్షాలకు జనం తడిసిముద్దైపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు ఒకేసారి విస్తరించడంతో ఈ వర్షాలు పడ్డట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో కూడా శనివారం రాత్రి పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. పరకాలలో ఏకంగా 19 సెం.మీ. కుండపోత వర్షం కురిసింది. నర్సంపేటలో 15 సెం.మీ. వర్షంపాతం నమోదైంది. కొత్తగూడలో 12 సెం.మీ, నల్లబెల్లిలో 11 సెం.మీ వర్షం పడింది.

కాగా, ఈ సీజన్‌‌లో వర్షాలు విస్తారంగా కురిసినట్లు అధికారులు తెలిపారు. సాధారణం కంటే 35శాతం వర్షపాతం అధికంగా కురిసినట్లు వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 66.4 మిల్లీమీటర్లు కాగా, 89.4 మిల్లీమీటర్లు నమోదైందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే తూర్పు, ఆగ్నేయం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో.. ఆది, సోమవారాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపుల కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Latest Articles
స్టన్నింగ్ స్టిల్స్‏తో మాయ చేస్తోన్న రింకు..
స్టన్నింగ్ స్టిల్స్‏తో మాయ చేస్తోన్న రింకు..
దేనికైనా నేను రెడీ.. జ్యోతిక. | కమల్‌ థగ్‌లైఫ్‌ షెడ్యూల్‌ అప్డేట్
దేనికైనా నేను రెడీ.. జ్యోతిక. | కమల్‌ థగ్‌లైఫ్‌ షెడ్యూల్‌ అప్డేట్
ఆ సమయంలో తీవ్ర కడుపునొప్పి వేదిస్తుందా? ఈ పొరబాట్లు చేయకండి..
ఆ సమయంలో తీవ్ర కడుపునొప్పి వేదిస్తుందా? ఈ పొరబాట్లు చేయకండి..
వరుణుడి దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి సభ రద్దు..!
వరుణుడి దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి సభ రద్దు..!
ఒత్తిడి శారీరక ఆరోగ్యంపై ఇంత ప్రభావం చూపుతుందా.? చాలా డేంజర్
ఒత్తిడి శారీరక ఆరోగ్యంపై ఇంత ప్రభావం చూపుతుందా.? చాలా డేంజర్
డయాబెటిస్‌పై మీక్కూడా ఈ అపోహలు ఉన్నాయా.? నిజాలు తెలుసుకోండి
డయాబెటిస్‌పై మీక్కూడా ఈ అపోహలు ఉన్నాయా.? నిజాలు తెలుసుకోండి
వివో నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌.. స్టన్నింగ్ డిజైన్‌తో..
వివో నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌.. స్టన్నింగ్ డిజైన్‌తో..
చిన్నారి ఇప్పుడు గ్లామరస్ బ్యూటీ.. అందమున్న అదృష్టమే లేదు..
చిన్నారి ఇప్పుడు గ్లామరస్ బ్యూటీ.. అందమున్న అదృష్టమే లేదు..
తెలుగు రాష్ట్రాల్లో చల్ల.. చల్లగా.! ఉరుములు, మెరుపులతో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో చల్ల.. చల్లగా.! ఉరుములు, మెరుపులతో వర్షాలు
కొత్త టీవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 10వేలలో స్మార్ట్‌ టీవీలు.
కొత్త టీవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 10వేలలో స్మార్ట్‌ టీవీలు.