AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయన అన్న మాటకు సినిమాలు మానేశా.. షాకింగ్ విషయం చెప్పిన వడ్డే నవీన్

1990-2000వ దశకంలో తెలుగు ఆడియెన్స్ ను అలరించిన స్టార్ హీరోల్లో వడ్డే నవీన్ కూడా ఒకరు. ప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతను అనతి కాలంలోనే మంచి నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచి హైట్, బాడీ పర్సనాలిటీ, హెయిర్ స్టైల్ తో అప్పట్లో చాలా మంది అమ్మాయిలకు ఫేవరెట్ హీరోగా మారిపోయాడు

ఆయన అన్న మాటకు సినిమాలు మానేశా.. షాకింగ్ విషయం చెప్పిన వడ్డే నవీన్
Vadde Naveen
Rajeev Rayala
|

Updated on: May 22, 2026 | 8:59 AM

Share

ఒకప్పుడు హీరోగా రాణించిన వారిలో వడ్డే నవీన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోగా రాణించాడు వడ్డే నవీన్. వరుసగా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 90లలో స్టార్ హీరోగా రాణించి.. వరుస హిట్స్ అందుకున్న వడ్డే నవీన్ మాత్రం ఇండస్ట్రీకి దూరమయ్యారు. టాలీవుడ్‌లో పేరున్న నిర్మాత వడ్డే రమేష్ తనయుడు నవీన్. 1996లో వచ్చిన క్రాంతి చిత్రంతో నవీన్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత 1997లో వచ్చిన కోరుకున్న ప్రియుడు చిత్రంతో అతను విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాకు ఓ రేంజ్‌ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో వడ్డే నవీన్ క్రేజీ హీరోగా మారిపోయాడు. దాంతో తక్కువ సమయంలోనే బిజీ హీరోగా మారిపోయాడు.

ఇది కూడా చదవండి : సినిమా వచ్చి 22ఏళ్లు.. కుర్రాళ్ళు థియేటర్స్‌లో ఎగబడి చూశారు.. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని మూవీ

ఆ తర్వాత పెళ్లి, మనసిచ్చి చూడు, లవ్ స్టోరీ 1999, స్నేహితులు , నా హృదయంలో నిదురించే చెలీ, ప్రేమించే మనసు, మా బాలాజీ, చాలా బాగుంది, బాగున్నారా, మా ఆవిడమీదొట్టు.. మీ ఆవిడ చాలా మంచిది, చెప్పాలని ఉంది, అయోధ్య , ఆదిలక్ష్మి, నా ఊపిరి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2010 తర్వాత.. ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. చివరిగా 2016లో ఆర్జీవీ తెరకెక్కించిన ఎటాక్ సినిమాలో కనిపించారు. ఇక ఇప్పుడు 10ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. కానిస్టేబుల్ త్రిమూర్తులు అనే సినిమాతో రానున్నారు.

ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది.. తారక్ చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను

తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ లో నవీన్ మాట్లాడుతూ.. తన సినీ ప్రస్థానం, దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో తన అనుభవం గురించి పంచుకున్నారు. ఆయన చివరి సినిమా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఎటాక్ . ఈ చిత్రంలో నవీన్ ఒక సహాయ పాత్రలో నటించారు. సినిమా షూటింగ్ దాదాపు నాలుగు ఐదు రోజులు ముగిసిన తర్వాత, రామ్ గోపాల్ వర్మ స్వయంగా వడ్డే నవీన్ వానిటీ వ్యాన్‌కు వచ్చారట..వర్మ, నవీన్‌తో మాట్లాడుతూ.. మీరు మంచి లుక్ ఉన్న వ్యక్తి, కానీ మీరు ఇలాంటి పాత్రలు చేయకూడదని నేను అనుకుంటున్నాను. మీకంటూ ఒక ప్రత్యేకమైన సినిమా ఉండాలి, దానిలో మీరు పని చేయాలి” అని వర్మ చెప్పారట. అప్పటికే నవీన్ కూడా తాను చేస్తున్న పని పట్ల అంత సౌకర్యంగా లేనని, ఇది సరైనది కాదని అనుకున్నారట.. ఎప్పుడైతే ఆర్జీవీ చెప్పిన మాటలతో వడ్డే నవీన్ ఇక సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నారట. అయితే, పూర్తిగా సినిమాలు మానేయడం కాకుండా, తనకు నచ్చే, ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని తను భావించే మంచి సినిమా వస్తేనే చేస్తానని డిసైడ్ అయ్యారట.. ఇక పై ఎలా ఉంటుందో చెప్పలేనని, వేచి చూడాలని చెప్పుకొచ్చారు వడ్డీ నవ్వీన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్